స్వచ్ఛమైన ఇందిరమ్మ పాలనను నిర్మిద్దాం.. అవినీతి పాలనను అంతం చేద్దాం

by S Gopi |
స్వచ్ఛమైన ఇందిరమ్మ పాలనను నిర్మిద్దాం.. అవినీతి పాలనను అంతం చేద్దాం
X

దిశ, ఇటిక్యాల: మండలంలో కొనసాగుతున్న హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా ఆదివారం ఏఐసీసీ కార్యదర్శి మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ షేక్ పల్లి, ససానులు, దువాస్ పల్లి గ్రామంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై చేయి చేయి కలుపుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకెళుతున్నారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

బీఆర్ఎస్ పార్టీ మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారాన్ని దక్కించుకుని ప్రజల సంక్షేమాన్ని తుంగలోకి తొక్కారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై సంపత్ కుమార్ విరుచుకుపడ్డారు. దళితులకు మూడు ఎకరాల భూమి లేదు.. నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదు.. రైతులకు రూ. లక్ష రుణమాఫీ చేస్తామని మోసం చేశారన్నారు. ఇకపై మోసపోవద్దని.. వచ్చేది ఇందిరమ్మ రాజ్యమని.. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ ప్రతి సంక్షేమ పథకాన్ని కాంగ్రెస్ నిర్వర్తిస్తుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరి సమస్యలను అడిగి తెలుసుకుంటూ అవినీతి పాలన అంతమొందించే సమయం ఆసన్నమైందంటూ భరోసానిచ్చారు.

బీఆర్ఎస్ పాలనతో అలంపూర్ నియోజక వర్గాల ప్రజలు కష్టాల్లో ఉన్నారని ప్రభుత్వ నిర్లక్ష్యంతో సంక్షేమ పథకాలు అమలుకాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సంపత్ కుమార్ ప్రతి గడపను తట్టుతూ భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలో వస్తుందని.. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రవల్లి సర్పంచ్ జోగుల రవి, వెంకటేష్, నాగశిరోమని, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story