మద్యంప్రియుల వల్లే నిండుతున్న రాష్ట్ర ఖజానా: మాజీ మంత్రి నాగం

by Kalyani |
మద్యంప్రియుల వల్లే నిండుతున్న రాష్ట్ర ఖజానా: మాజీ మంత్రి నాగం
X

దిశ, నాగర్ కర్నూల్ ప్రతినిధి: రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో కేవలం మద్యంప్రియుల వల్లనే రాష్ట్ర ఖజానా నింపుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి పట్టిందని మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా అవసరాల కోసం పనిచేయడం లేదని, కేవలం కమర్షియల్ దందా రూపంలోనే పాలన అందిస్తుందని ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా విధించని విధంగా పెట్రోల్, డీజిల్ పన్నులను విధిస్తూ అడ్డగోలుగా ధరల పెంపుదలకు కారణమవుతుందని మండిపడ్డారు.

ఉద్యోగులకు నెలనెలా సక్రమంగా జీతాలు ఇవ్వలేని స్థితిలోకి వెళ్లిందని, కేవలం ఖజానాను నింపుకోవడానికి అమాయక యువతను మద్యం మత్తులోకి నెడుతున్నారని చెప్పారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఎన్ని వదంతులు సృష్టించినా, తానే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో తెలకపల్లి జడ్పీటీసీ సుమిత్ర, డీసీసీ ప్రధాన కార్యదర్శి అర్థం రవి, కాంగ్రెస్ నాయకులు నాగం శశిధర్ రెడ్డి, నారాయణ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story