- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేను అక్కడి నుండే పోటీ చేస్తా.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
దిశ, అచ్చంపేట : తనపై కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, పూటకో వార్త వస్తోందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. మంగళవారం నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామంలోని అటవీశాఖ మయూరి విశ్రాంతి భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు కొన్ని పత్రికలు ఉన్నది లేనట్టుగా రాస్తున్నాయని, గతంలో కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు విశాఖపట్నంలోని ఒక వివాహానికి హాజరైన సందర్భంగా ఆయనతో మా నివాసంలో టీ పార్టీ జరిగిన విషయం వాస్తవం అని, కానీ ఫలానా పార్టీలో చేరుతున్నట్లు ఎలాంటి చర్చలు జరగలేదని ఆయన కుండబద్దలు కొట్టారు.
తిరిగి ఇక్కడ నుండే పోటీ..
2018 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నుండి స్వతంత్ర పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేశానని.. ఆనాడు తనకు 2 లక్షల88,814 ఓట్లు బ్యాలెట్ ఓట్లతో కలిపి వచ్చాయని గుర్తు చేశారు. ఒక స్వతంత్ర అభ్యర్థి ఎక్కడ నుంచి అయినా పోటీ చేసుకునే ప్రజాస్వామ్యంలో హక్కు ఉందని తిరిగి రాబోయే ఎన్నికల్లో కూడా విశాఖపట్నం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరడం లేదు
బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని జరుగుతున్న ప్రచారంలో నిజం ఉన్నదా అని ఆయనను దిశ ప్రశ్నించగా.. అదేమీ లేదని కొట్టి పారేశారు. తనకున్న ప్రజాస్వామ్య భావాలకు అనుకూలంగా ఏ పార్టీ వారైనా కలిసి వస్తే వారితో కలుస్తానని లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన వివరించారు.
ఆ విషయంలో నిజాలు తేలాలి
ఫామ్ హౌస్ కేసు ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై 'దిశ' జేడి అభిప్రాయాన్ని కోరగా.. ప్రభుత్వం ఫామ్ హౌస్ విషయంలో హై కోర్టును ఆశ్రయించగా ఆ వాదనలను సింగిల్ బెంచ్ తోసిపుచ్చిందని, ఏది ఏమైనా పనికి ఏది ఏమైనప్పటికీ నిజాలు బయటకి తెలవాలని వాస్తవాలు ప్రజలకు తెలిసినప్పుడే ఏం జరుగుతుందన్న విషయం స్పష్టం అవుతుందని చెప్పారు. ఆ విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశిస్తున్నారని ఒక పత్రికలో చదివానన్నారు.
చైతన్యవంతమైన సమాజం
ఓటు బ్యాంకు రాజకీయాలు కొనసాగుతున్నాయని, వాటికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని, ప్రస్తుత రాజకీయాలు కులాలు, మతాలను, అడ్డుపెట్టుకొని పథకాల పేరుతో రాజకీయాలు కొనసాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు మరింత చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందన్నారు.
ఓటు ఓ ఆయుధం
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో చాలా సులువుగా అందరికీ ఓటు అనే ఆయుధాన్ని ఒక హక్కు వచ్చిందని... కానీ చాలా దేశాలు ఓటు హక్కు కోసం పోరాటాలు చేసి సాధించుకుంటున్నారని గుర్తు చేశారు. మీడియా కూడా ఓటు ప్రాధాన్యతపై దృష్టి పెట్టాలన్నారు. పాలకులు పథకాలను ప్రవేశపెడితే వాటిని సమర్థవంతంగా అమలు చేయవలసిన బాధ్యత అధికారులపై ఉంటుందన్నారు.
సున్నిపెంటలో డైమండ్ జూబ్లీ వేడుకలు
తాను విద్యాభ్యాసం చేసిన కళాశాల లో జూబ్లీ డైమండ్ వేడుకలు నిర్వహిస్తున్నామని, వాటిని సమర్థవంతంగా చేసేలా పూర్వ విద్యార్థుల చేత సమాలోచన చేసేందుకు ఇక్కడికి వచ్చానని ఆయన తెలిపారు. 1963 లో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా సున్నిపెంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 60 సం. పూర్తి అవుతున్న సందర్భంగా డైమండ్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తూ ఈ వేడుకల సందర్భంగా ఆనాడు డ్యామ్ లో పనిచేసిన వారిని కొందరిని గుర్తించి సత్కరించడం అలాగే అటల పోటీలు, జాబ్ మేళా తదితర కార్యక్రమాలు నిర్వహించేందుకు రూపకల్పన చేస్తున్నామన్నారు. ఆయనతోపాటు ఏపీకి చెందిన సికిందర్ భాష, దోమలపెంట గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి బి అర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు శివారెడ్డి, ఎంపీటీసీ మల్లికార్జున్, గంటల మల్లయ్య, శంకర్ తదితరులు ఉన్నారు.