- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ యంత్రానికి సైతం అవరోధాలు.. రోబో వెళ్లి 24 గంటలు కానీ..

దిశ,అచ్చంపేట : ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో మృతి చెందిన మిగతా 7 మంది మృతులను గుర్తించేందుకు ప్రభుత్వం సర్వశక్తులు వడ్డించి అన్ని ఉపాయాలను, సాంకేతిక నిపుణులను, దేశ అత్యున్నత రెస్క్యూ బృందాల సలహాలు ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి హైడ్రా తదితర 12 బృందాలతో నిరంతరాయంగా గత 20 రోజులుగా వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా రోబో యంత్రాల ద్వారా ఆర్ ఎస్ క్యూ ఆపరేషన్ వేగవంతం చేసేందుకు గత మూడు రోజులుగా రోబో నిపుణుల బృందం కూడా రంగంలోకి దిగింది.
24 గంటలు గడిచిన...
అత్యంత క్లిష్టతర పరిస్థితుల్లో కూడా రోబో యంత్రం తన పనితనాన్ని మొదలుపెట్టి సహాయక చర్యలు వేగవంతం చేసేలా బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇద్దరు రోబో నిపుణులతో రోబో యంత్రం లోకో ట్రైన్ ద్వారా రెస్క్యూ బృందాలతో సొరంగంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. కానీ ఆ రోబో యంత్రానికి సైతం ప్రమాదవ స్థల అతి సమీపంలో ఉన్న ప్రమాదకరంగా ఎంచబడుతున్న డి 1వన్ డి 2 ప్రదేశాలలో రెస్క్యూ ఆపరేషన్ చేసి వేగంగా పేరుకుపోయిన మట్టిని బయటకు తీసేందుకు వెళ్లిన రవ్వ యంత్రం ఇతర సాంకేతిక లోపాలు ఎదురవుతున్న నేపథ్యంలో 24 గంటలు గడిచినా కూడా ఆ రోబో యంత్ర పనితనం మొదలు కాలేదు. దీనిని బట్టి చూస్తే ఎస్ఎల్బీసీ సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ ఎంత ప్రమాదభరితంగా ఎంత కఠినంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయో సమాజం అర్థం చేసుకోవచ్చు. గడిచిన 24 గంటల నుండి సంబంధిత ఉన్నతాధికారులు రోబో యంత్రం పనితీరుపై ఇలాంటి అప్డేట్ను ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు.