పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఇబ్బందులు రానివ్వొద్దు: అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్

by Kalyani |
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఇబ్బందులు రానివ్వొద్దు: అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్
X

దిశ, ప్రతినిధి నారాయణపేట: జూన్ 11న జరగనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఇబ్బందులు రానివొద్దని అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ గురువారం కలెక్టరేట్ లోని వీసీ హాల్లో సంబంధిత అధికారులు, పరీక్ష కేంద్రాల కో ఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రూప్ -1 పరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

కేంద్రాలలో త్రాగునీరు, విద్యుత్, సి.సి. కెమెరాలు, సీటింగ్, మరుగుదొడ్లు, మెడికల్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు సిబ్బందిని నియమించి ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష నిర్వహణ సమయంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో 7 పరీక్షా కేంద్రాలలో 2132 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రాంచందర్, కలెక్టరేట్ ఆయా ఏఓ నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story