- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరి ధాన్యం రవాణాకు ఇబ్బందులు కలిగిస్తే ఉపేక్షించం: మంత్రి నిరంజన్ రెడ్డి
దిశ, వనపర్తి: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం రవాణా చేసే క్రమంలో లారీల యాజమానులు రైతులకు ఇబ్బందులు కలిగిస్తే ఉపేక్షించేది లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లా పరిధిలోని పెద్దమందడి, ఖిల్లా ఘణపురం మండలాలలోని వీరయ్యపల్లి, ఖిల్లా ఘణపురం మండల కేంద్రంలో, సోలిపూర్, మనజీపేట, మల్కాపూర్, షాపూర్, గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వనపర్తి జిల్లా పరిధిలో నాలుగు లక్షల ఇరవై మెట్రిక్ టన్నుల వరి ధాన్య సేకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేవామన్నారు. కొనుగోలులలో మిల్లర్లు, లారీ యాజమానులు రైతులకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఎంపీపీ కృష్ణ నాయక్, సింగిల్ విండో చైర్మన్ మురళీధర్ రెడ్డి, జడ్పీటీసీ సామ్యా నాయక్, రైతు మండల కోఆర్డినేటర్ వెంకట్రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, వనపర్తి మార్కెట్ వైస్ చైర్మన్ బాల్లీశ్వర్ రెడ్డి, పౌరసరఫరా మార్కెటింగ్ శాఖ అధికారులు కొండల్ రావు, స్వరన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.