చిల్లిగవ్వ ఇవ్వొద్దు అర్హులైన పేదలందరికి ఇండ్లు: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

by Hamsa |
చిల్లిగవ్వ ఇవ్వొద్దు అర్హులైన పేదలందరికి ఇండ్లు: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
X

దిశ,జడ్చర్ల : డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఎవ్వరూ, ఎక్కడా, ఎవ్వరికీ కూడా చిల్లిగవ్వ ఇవ్వరాదని,అర్హులైన పేదలందరికీ నిబంధనల మేరకు డబుల్ ఇండ్ల కేటాయింపుల్లో లబ్ధి చేకూరుస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డులో పర్యటించారు. సొంత స్థలం ఉండి, ఇల్లులేక ఇబ్బందులు పడుతున్న పేదలకు ప్రభుత్వమే ఇంటి నిర్మాణం కోసం రూ. 3 లక్షలు మంజూరు చేస్తున్న దని తెలిపారు. ఇది కాక స్వంత జాగ లేకుండా, ఒకే ఇంట్లో ఇద్దరు,ముగ్గురు కుటుంబాలు ఉండి, ఇబ్బందులు పడుతున్న పేదలకు డబుల్ ఇండ్ల కేటాయింపుల్లో తగిన గుర్తింపు ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఈ మేరకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఇప్పటికే పాత హరిజన వాడలో ఇండ్ల కేటాయింపు పై పరిశీలన జరిపిన ఎమ్మెల్యే, పట్టణంలోని ప్రతి వార్డులో క్షేత్ర స్థాయి పరిశీలన చేయనున్నట్లు తెలిపారు. ఇందులో మధ్య దళారుల బెడద లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు.జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే వెయ్యి ఇండ్లు నిర్మించడం జరిగిందని, ప్రభుత్వం నుండి మరిన్ని ఇండ్లు మంజూరు చేయించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. దీనితోపాటు నియోజకవర్గంలోని అన్ని మండలాలు,గ్రామాల్లో కూడా డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేసి పేద కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.

27న హరీష్ రావు పర్యటన

ఈ నెల 27న రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జడ్చర్ల 100 పడకల ఆస్పత్రి ప్రారంభించేందుకు వస్తున్నట్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. రూ.33 కోట్లతో నిర్మించిన ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్ కూడా అందుబాటులో ఉంటుందని అన్నారు.ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జడ్చర్ల అభివృద్ది పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, 70 ఏండ్ల పాటు రాష్ట్రాన్ని,దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ చెందిన అభివృద్ధి శూన్యమని అన్నారు.అదే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా మత పరమైన విద్వేషాలు రెచ్చగొడుతుంది తప్ప, దేశం కోసం చేసింది ఏమీ లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్, బాద్మి శివకుమార్,పిట్టల మురళి,రామ్మోహన్,సతీష్,కొండల్,హఫీజ్ ,లక్ష్మయ్య,శ్రీకాంత్,శంకర్, ఇంతియాజ్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed