- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది నియంత పాలన: డీసీసీ అధ్యక్షుడు జీఎంఆర్
దిశ, మహబూబ్ నగర్: కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ లు నియంత పరిపాలన కొనసాగిస్తున్నారని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జి.మధుసూధన్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంత పాలనను నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎస్ యూఐల సంయుక్త ఆధ్యర్యంలో కాంగ్రెస్ కార్యాలయం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి పీఎం నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జి. మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని, రాహుల్ గాంధీపై పార్లమెంట్ సభ్యత్వాన్ని అనర్హత వేటు వేయడం అప్రజాస్వామిక చర్య అని ఆయన విమర్శించారు.
ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మాట్లాడుతూ ఉద్యోగాల కోసం యువత రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు వినోద్, సంజీవ్ ముదిరాజ్, మహిళా అధ్యక్షురాలు వసంత, సిరాజ్ ఖాద్రీ, లక్ష్మణ్ యాదవ్, సీజే బెనహర్, సాయిబాబా, ఎన్ఎస్ యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముకుంద రమేష్ తదితరులు పాల్గొన్నారు.