- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈనెల 9 లోపు ధరణి సమస్యలు పరిష్కరించాలి
దిశ, నారాయణపేట ప్రతినిధి: ఈనెల 9న ధరణి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 1 నుంచి 9 వరకు చేపట్టిన ధరణి స్పెషల్ డ్రైవ్ పై బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తహసీల్దార్లతో సమీక్షించి మాట్లాడుతూ అన్ని స్థాయిలో విచారణలు చేసి, ఫైళ్ళను (దస్త్రాల) పరిశీలించి వాటి వివరాలను కంప్యూటర్ లో నమోదు చేయాలని తహసీల్దార్లకు సూచించారు. మండలాల వారీగా ధరణి పెండింగ్ ఫైల్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ధరణి విషయంలో తీసుకున్న కొన్ని మార్పులకు అనుగుణంగా ఎక్సెంట్ మార్పులు, మిస్సింగ్ సర్వే నంబర్లు, అసైన్డ్ ల్యాండ్స్, డిలీషన్స్ తదితర అంశాలపై వచ్చే అనుమానాలను నివృత్తి చేసుకొని పెండింగ్ ఫైల్స్‌ను క్లియర్ చేయాలని కలెక్టర్ సూచించారు. కాగా జిల్లా వ్యాప్తంగా 2340 పెండింగ్ ఫైల్స్‌కి గాను 1325 కి అప్రూవల్ చేయగా, 1015 పెండింగ్‌లో ఉన్నాయని వాటిని కూడా క్లియర్ చేయాలన్నారు. తహసీల్దార్లు తమ తమ లాగిన్‌లో ఉన్న సమస్యలను కొత్తగా వచ్చిన ఆప్షన్‌ను ఉపయోగించుకుని పరిష్కరించుకోవాలని ఆయన తెలిపారు.