ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ ఎస్. మోతిలాల్

by Kalyani |
ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ ఎస్. మోతిలాల్
X

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: ధరణిలో వచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ మోతిలాల్ రెవిన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధరణి పెండింగ్ ఫిర్యాదులపై ఆర్డీవోలు, తహసీల్దారులు రెవిన్యూ అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సీలింగ్‌, ఇనాం, అసైన్డ్‌, వివిధ పట్టాలలో జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో పెండింగ్‌లో ఉన్న 5,137 ఫిర్యాదుల పరిష్కారం ఎలా అనే విషయాలపై అధికారులతో ఆరాతీశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ధరణిలో పేరు, భూమి స్వభావం, భూమి వర్గీకరణ, భూమిరకం, పరిధి దిద్దుబాటు, మిస్సింగ్‌ సర్వే, సబ్‌ డివిజన్‌ నెంబర్‌, నేషనల్‌ ఖాతా నుంచి పట్టాకు భూమి బదిలీ వంటివి మార్చుకోవడానికి ధరణిలో నమోదు చేసుకున్న ఫిర్యాదులను తహసీల్దార్లు వెంటనే పరిష్కరించి, కలెక్టర్ లాగిన్ కు చేరవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో శ్రీనివాసులు కలెక్టరేట్ సూపరింటెండెంట్ బాల్ రాజ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Next Story