- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆయుధాల పనితీరుపై పరిజ్ఞానం పెంచుకోండి: ఎస్పీ రక్షిత కే మూర్తి

దిశ, వనపర్తి: పోలీసు అధికారులు, సిబ్బంది తమ విధుల్లో వినియోగిస్తున్న ఆయుధాల పనితీరుపై పరిజ్ఞానం పెంపొందించుకోవాలని జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి సూచించారు. గురువారం ఉదయం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఎర్రవల్లి 10 వ బెటాలియన్ ఫైరింగ్ రేంజ్ లో రిజర్వ్ ఇన్ స్పెక్టర్ జగన్ నేతృత్వంలో పోలీసు అధికారులు, సిబ్బందికి 2023-24 సంవత్సర పైరింగ్ ప్రాక్టీస్ ను మూడు రోజులు పాటు నిర్వహించారు. ఫైరింగ్ ప్రాక్టీస్ లో పోలీసులు విధుల్లో వినియోగించే ఆయుధాలతో ఫైరింగ్ చేయించారు.
ఫైరింగ్ ప్రాక్టీస్ లో ఎస్పీ రక్షిత కే మూర్తి స్వయంగా పాల్గొని, ఫైరింగ్ చేసి ఆయుధ నైపుణ్యాన్ని పరీక్షించుకున్నారు. అలాగే ఫైరింగ్ ప్రతిభను కనబరచిన పోలీసు అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్, డీఎస్పీ ఆనంద రెడ్డి, ఆత్మకూరు సీఐ రత్నం, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.