- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీజేపీ కుట్రలను తిప్పికొట్టండి: ఎమ్మెల్సీ రవీందర్ రావు
దిశ, ఉండవల్లి: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం అలంపూర్ చౌరస్తా వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సమావేశానికి ఎమ్మెల్యే అబ్రహంతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రవీందర్ రావు మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షను తీర్చడం కోసం సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు. అందరినీ ఏకతాటిపైకి తెచ్చి రాష్ట్రం సాధించిన గొప్ప నేత కేసీఆర్ అని కొనియాడారు. ఎందరో ఉద్యమకారుల ప్రాణాలకు తెగించి పోరాడారన్నారు.
సమైక్య పాలనలో నీళ్లు, నిధులు నియమాకాలు లేక గోస పడిన సంగతులు గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే తెలంగాణ తలమానికంగా ఉందన్నారు. రైతుబంధు, రైతులకు 24 గంటల విద్యుత్, సాగునీరు, తాగునీరు అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. ఈ నాలుగేళ్లలో ఏళ్లలో అలంపూర్ నియోజకవర్గానికి దాదాపుగా 15,400 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ.. సమైక్య పాలనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొనమని రాష్ట్ర సాధకుడు, దేశ్ కి నేత కేసీఆర్ అని కొనియాడారు.
అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే అగ్ర భాగాన నిలిపిన గొప్ప నేత కేసీఆర్ అన్నారు. అనంతరం ఎమ్మెల్యే సమక్షంలో ప్రజాప్రతినిధులు పలు తీర్మాన అంశాలను ప్రతిపాదించి ఆమోదించారు. కార్యక్రమంలో వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపల్ చైర్మన్ లు కరుణ శ్రీ, మనోరమ, జడ్పీటీసీలు వడ్డేపల్లి రాజు, సుగుణమ్మ, ఎంపీపీ బీసమ్మ, వైస్ ఎంపీపీ దేవన్న, రాష్ట్ర యువజన నాయకులు అజయ్, సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు, బీఆర్ఎస్ ఆయా మండలాల అధ్యక్షులు రమణ, మహేశ్వర్ రెడ్డి, సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.