- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిబంధనలు పాటిద్దాం... నేరాలు నివారిద్దాం..
దిశ, అచ్చంపేట : సీసీ కెమెరాల వినియోగం గొప్పదని, ఏ సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను గుర్తించడం మరింత సులభతరం అవుతుందని ప్రభుత్వ విప్, పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ని జిల్లా ఎస్పీ మనోహర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు, మహిళలకు సీసీ కెమెరాలు, దొంగతనాల పై పోలీస్ స్టేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ప్రతీషాప్, ఇల్లు, కాలనీలు, స్కూల్, కాలేజ్ ల ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మీకు మీరే భద్రత అని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు, మహిళలకు సీసీ కెమెరాలు, దొంగతనాలపై పోలీస్ స్టేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ప్రతీషాప్, ఇల్లు, కాలనీలు, స్కూల్, కాలేజ్ ల ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మీకు మీరే భద్రత అని పేర్కొన్నారు.
ఒక సీసీ కెమెరా..
ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. అచ్చంపేటలో ఇటీవల జరిగిన దొంగతనాలు దృష్టిలో ఉంచుకుని కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు అందరు కూడా కలిసికట్టుగా ఉండాలన్నారు. పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు తన వంతుగా రూ.10లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. వాహన రిజస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు.
సురక్షిత అచ్చంపేట..
అచ్చంపేట పట్టణాన్ని సురక్షిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో మొత్తం 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక సీసీకెమెరా 100 మందితో సమానమని సాక్షి అబద్ధం చెప్పినా సీసీ కెమెరా అబద్ధం చెప్పదని అన్నారు. అనంతరం డీఎస్పీ కృష్ణ కిషోర్ మాట్లాడుతూ మూడోకన్ను నిఘానేత్రం ఉందన్న విషయం పట్టణ నియోజకవర్గ ప్రజలు మర్చిపోవద్దని, ట్రాఫిక్ నిబంధనలు రూల్స్ ను పాటిస్తూ అందరికీ ప్రయోజనకరంగా ఉండేలా చట్టాన్ని గౌరవిస్తూ నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిఘా నేత్రం ద్వారా గుర్తించిన తప్పులను ఉపేక్షించేది లేదని చట్టపరంగా తగిన శిక్షలు ఉంటాయని తెలిపారు. అంతకుముందు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మనోహర్, మునిసిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అరుణ, కౌన్సిలర్లు, డీఎస్పీ కృష్ణ కిషోర్, సీఐ అనుదీప్, ఎస్సైలు గోవర్దన్, శివానందంగౌడ్, గురుస్వామీ, పోలీస్ లు పాల్గొన్నారు.
డ్రైవింగ్ లైసెన్స్ ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు. సురక్షిత అచ్చంపేట - సురక్షిత ప్రజలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. పట్టణంలో మొత్తం 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. అంతకుముందు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మనోహర్, మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అరుణ, కౌన్సిలర్లు డీఎస్పీ కృష్ణ కిషోర్, సీఐ అనుదీప్, ఎస్సైలు గోవర్దన్, శివానందంగౌడ్, గురుస్వామీ, పోలీస్ సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.