- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దివ్యాంగులు వైకల్యాన్ని అధిగమించి విజేతలుగా నిలవాలి.. కలెక్టర్ ఉదయ్ కుమార్
దిశ, నాగర్ కర్నూల్: దివ్యాంగులు తమ వైకల్యాన్ని అధిగమించి విజయం సాధించాలని జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు. శనివారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా స్థానిక వెలమ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని దివ్యాంగులకు రూ.45 లక్షల విలువైన బ్యాటరీ బైకులు, ట్రైసైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగవైకల్యం అనేది విజయానికి ఏమాత్రం అడ్డుకాదని చెప్పారు. ఎంతో మంది దివ్యాంగులు కష్టపడి ఎన్నో విజయాలు సాధించారని, అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దివ్యాంగుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఉపాధి హామీ శ్రమశక్తి సంఘాలలో 2,883 మంది దివ్యాంగులను సభ్యులుగా చేర్పించామని చెప్పారు.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 13,371 మంది దివ్యాంగులకు ఆసరా పింఛన్ ద్వారా నెలకి రూ.4,03,26,936 అందిస్తున్నామని చెప్పారు. అనంతరం క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు. అలాగే దివ్యాంగ హక్కుల కరదీపికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కల్పన, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మి, డీఆర్డీఏ పీడీ నర్సింగరావు, ఆర్టీసీ డీఎం ధరమ్ సింగ్, మున్సిపల్ కమిషనర్ జయంత్ కుమార్, సెక్టోరిల్ అధికారి వెంకటయ్య, సంఘం నాయకులు కందనూలు నిరంజన్, నారాయణమ్మ, నిర్మల, బాలపిర్, నిరంజన్, సఖి కోఆర్డినేటర్ సునీత, చైల్డ్ ప్రొటెక్షన్ చైర్మన్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.