- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆలపై సీఎం ప్రశంసల జల్లు
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంఎస్ డిగ్రీ కళాశాల మైదాన ప్రాంగణంలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తూ నీటి వనరుల పెంపుదల విషయంలో మంత్రి, ఎమ్మెల్యేల కృషి అమోఘమన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చెక్ డ్యాములు నిర్మించి పెద్ద ఎత్తున నీటి వనరులను అందుబాటులోకి తేవడంతో పాటు భూగర్భ జలాల మట్టం పెరుగుదలకు చేసిన కృషి అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే చేసిన పనులను మీడియా ద్వారా తెలుసుకొని చాలా సంతోషపడ్డానని చెప్పారు. అలాగే మంత్రి నిరంజన్ రెడ్డి ఏకంగా నీళ్ల నిరంజన్ రెడ్డి గా పేరు తెచ్చుకున్నారని సీఎం పొగిడారు. మంత్రి, ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి ప్రశంసల జల్లు కురిపించినప్పుడు సభకు హాజరైన జనం పెద్ద ఎత్తున హర్షద్వానాలు చేశారు.