విద్యుత్ వెలుగులు అందించిన గొప్ప నేత సీఎం కేసీఆర్ : ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి

by Kalyani |
విద్యుత్  వెలుగులు అందించిన గొప్ప నేత సీఎం కేసీఆర్ : ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి
X

దిశ, గద్వాల : గత పాలకుల వైఫల్యం వల్ల తెలంగాణ ప్రజలు చీకట్లోనే మగ్గారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చీకటిని చీల్చి విద్యుత్ వెలుగులను అందించిన ఓ గొప్ప నేతగా సీఎం కేసీఆర్ నిలిచిపోయారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో గద్వాల నియోజకవర్గంలో గతంలో రైతులకు కేవలం రెండు వేల వరకు మాత్రమే ట్రాన్స్ ఫార్మర్ లు ఉండేవని ప్రస్తుతం 6 వేలకు పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. గృహ వినియోగదారులకు సుమారు 70 వేలకు పైనే విద్యుత్ మీటర్లు అమర్చిన ఘనత విద్యుత్ శాఖకు దక్కుతుందని చెప్పారు. 24 గంటలు విద్యుత్ సరఫరా చేయడంతో తెలంగాణ సస్యశ్యామలమైందని, పచ్చని పాడిపంటలతో తెలంగాణ పచ్చదనం సంతరించుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ సరోజమ్మ, శ్రీధర్ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ జంబురామన్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ సుభాన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story