- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీఎస్పీ, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ..
దిశ, నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్ కర్నూల్ జిల్లాలోని తూడుకుర్తి గ్రామంలో బీఎస్పీ, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ఆయా గ్రామాల్లో బీఎస్పీ జెండా దిమ్మెలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తూదుకుర్తి గ్రామంలో బీఎస్పీ నేతలు గ్రామ బస్టాండ్ ప్రాంతంలో నిర్మిస్తున్న క్రమంలో స్థానిక బీఆర్ఎస్ నేతలు వారిని అడ్డుకున్నారు.
ప్రజలకు ఇబ్బందికర ప్రాంతంలో దిమ్మెలను ఏర్పాటు చేయొద్దు అంటూ వారిని నిలువరించారు. కాగా మీ పార్టీ దిమ్మెలు కూడా ప్రజలకు ఇబ్బందితో పాటు అనుమతి లేకుండా దిమ్మెలను ఏర్పాటు చేశారని వారించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట, దూషణలతో ఘర్షణ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న ఎస్ఐ వీణా కుమారి వారి సిబ్బందితో గ్రామానికి చేరుకొని ఇరువర్గాలను నిలువరించారు.