- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
శ్రీశైలం వెళ్లే వాహనదారులకు బిగ్ అలర్ట్…మన్ననూర్ చెక్ పోస్ట్ వద్ద రహదారి క్లోజ్

దిశ, అచ్చంపేట : జిల్లాలో రానున్న 24 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఆదివారం సెలవు దినం కావడం.. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణం అందాలను తిలకించేందుకు పకృతి ప్రేమికులు, యాత్రికులు భారీగా వచ్చే అవకాశం ఉంటుందని భావించిన అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాసులు అమ్రాబాద్ ఈగలపెంట పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని ఆదివారం డీఎస్పీ దిశకు ఫోన్ ద్వారా తెలిపారు.
ప్రధానంగా నల్లమల లోని హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి వీకెండ్ కారణంగా వందలాది వాహనాలు రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వెళుతుంటారు. ప్రధానంగా గత మూడు రోజుల నుంచి నిరంతరాయంగా వర్షాలు కురుస్తుండడంతో అమ్రాబాద్ మండలం ఈగలపెంట గ్రామం నుండి పాతాళ గంగ వద్ద వరకు శ్రీశైలం ప్రాజెక్టు ప్రధాన ఘాట్ రోడ్డు పై పలుచోట్ల కొండ చర్యలు విరిగి పడుతున్నాయని తద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని దృష్టిలో ఉంచుకొని శ్రీశైలం వెళ్లే యాత్రికులు ఎవరు రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మన్ననూర్ వద్ద చెక్ పోస్ట్ క్లోజ్...
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఉన్న మన్ననూర్ గ్రామంలోని అటవీశాఖ చెక్పోస్టులు భద్రత రీత్యా మూసి వేస్తున్నామని డీఎస్పీ పల్లె శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే వాహనాలను శ్రీశైలం ప్రాజెక్టు ఘాట్ రోడ్డుపై కొండ చర్యలు విరిగి పడుతున్న నేపథ్యంలో వాహనాలను అనుమతించడం లేదని, దీనిని గమనించి ఇతర ప్రాంతాల నుంచి శ్రీశైలం వెళ్లాలి అనుకునేవారు ప్రయాణాలను సూచిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యా కారణాలవల్ల ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, సహకరించాలని డీఎస్పీ హెచ్చరించారు.