- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లబ్ధిదారులకు గుబులు పుట్టిస్తున్న డబుల్ ఇండ్లు
దిశ,గద్వాల : జిల్లాలో డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని గద్వాల పట్టణం దౌదర్ పల్లి శివారులో 1300 డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారు. అర్హులకు ఇవ్వాలని అధికారులు పలుమార్లు సర్వేలు చేయించి..పట్టణంలో 4000 మందిని అర్హులని గుర్తించారు. అనంతరం స్టానిక గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి,జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డిప్ తీసి లబ్ధిదారులను ఎంపిక చేశారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో గత ప్రభుత్వం 2016 నుంచి విడతల వారీగా డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపడుతూ వచ్చింది. ఇప్పటికీ గద్వాల నియోజకవర్గంలో 1385,అలంపూర్ నియోజకవర్గంలో 25 డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసింది. అయితే జిల్లా కలెక్టర్ , ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలిసి అర్హులను అధికారుల వెరిఫికేషన్ ద్వారా 4000 మందిని గుర్తించారు. 1360 ఇండ్లు మాత్రమే ఉండటంతో ..డిప్ సిస్టం ద్వారా 1360 మందిని ఎంపిక చేశారు. మిగిలిన వారికి మళ్ళీ విడతలో ఇళ్లను ప్రభుత్వం తరపున డడబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇస్తామని హామీలు ఇచ్చారు. ఇక గద్వాల మండలం గొనుపాడు దగ్గర నిర్మించిన 25 ఇండ్లు,అలంపూర్ నియోజకవర్గం క్యాతురు దగ్గర నిర్మించిన 25 ఇండ్లు గ్రామ తీర్మానాలతో కొందరికి కేటాయించారు. దీంతో ఆయా గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు అభ్యంతరం తెలుపుతూ ..జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. వాటిని కూడా డిప్ పద్ధతిలోనే కేటాయిస్తామని గ్రామపంచాయతీ తీర్మానాన్ని కలెక్టర్ రద్దు చేశారు. అయితే 50 ఇండ్లు పూర్తయి దాదాపు 10 సంవత్సరాలు కావడంతో..పిచ్చిమొక్కలు మొలిచి శిధిలమైపోతున్నాయి.
లబ్ధిదారులకు శాపంగా మారిన ఎన్నికలు
లబ్ధిదారులకు ఇండ్ల తాళాలు ఇస్తారనుకున్న తరుణంలోనే ఎన్నికలు రావడం..ప్రభుత్వాలు మారడం..ఇళ్లు లేని తమ లాంటి నిరుపేదలకు శాపంగా మారిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులను డిప్పు ద్వారా ఎంపిక చేసి రెండేళ్లు గడచిన ఇంకా వారికి డబుల్‌బెడ్ రూమ్ ఇంటికి సంబంధించిన ఒక్క కాగితం అధికారులు ఇవ్వలేదని వాపోతున్నారు. లక్కీ డిప్ లో పేర్లు వచ్చిన వారు ప్రస్తుతం అయోమయ స్థితిలో ఉన్నారు.