SP Janaki : ప్రయాణికుల భద్రత కోసమే ఆటోలకు నెంబర్లు..

by Sumithra |
SP Janaki : ప్రయాణికుల భద్రత కోసమే ఆటోలకు నెంబర్లు..
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : ప్రయాణికుల భద్రత కోసం, జిల్లా ఎస్పీ జానకి ఆదేశాల మేరకు పట్టణంలో తిరుగుతున్న ఆటోలకు వరుస నెంబర్లను వేస్తున్నామని ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహం చౌరస్తాలో ఆయన ప్రతి ఆటోకు మూడు వైపులా వరుస నెంబర్లను రాయించి మీడియాతో మాట్లాడారు.

ప్రయాణికులు ఎక్కే ఆటోకు ఉండే నెంబర్ ను గుర్తు పెట్టుకోవాలని, తద్వారా తమ లగేజీ, వస్తువులు మర్చిపోయినా ఆ నెంబర్ ను చెపితే మరిచిపోయిన తమ వస్తువులను తిరిగి అప్పగించడానికి సులువుగా ఉంటుందని ఆయన అన్నారు. ఇటీవలే ఒక ఆటో యజమాని వృద్ధులను తమ గమ్యస్థానాలకు చేరుస్తామని, నిర్మానుష్య ప్రాంతాల్లోకి తీసుకువెళ్లి వారిని బెదిరించి నగలు, డబ్బు లాక్కున్న సంఘటనలు కూడా వెలుగు చూశామని, ఇలాంటి సంఘటనలు జరగకుండా చెక్ పెట్టేందుకు, ఆటోలను గుర్తించేందుకు ఈ నెంబర్లతో సులువుగా ఉంటుందని ఆయన వివరించారు.

Advertisement

Next Story