గద్వాల్‌లో అట్టహాసంగా కాసమ్ ఫ్యాషన్ షాపింగ్ మాల్ ప్రారంభం

by Naresh |
గద్వాల్‌లో అట్టహాసంగా కాసమ్ ఫ్యాషన్ షాపింగ్ మాల్ ప్రారంభం
X

దిశ, గద్వాల్: జోగుళాంబ గద్వాల కేంద్రంలో‌ అధునాతన హంగులతో సరి కొత్తగా రూపొందించుకున్న కాసమ్ ఫ్యాషన్​ షాపింగ్ మాల్ అట్టహాసంగా ప్రారంభమైంది. గద్వాల పట్టణం కృష్ణవేణి చౌరస్తాలో ఏర్పాటు చేసిన కాసమ్ ఫ్యాషన్​ షాపింగ్ మాల్‌ను బుధవారం ప్రముఖ సినీనటి మెహ్రీన్ పిర్జాదా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపింగ్‌మాల్లో ఆమె కలియ తిరిగారు. స్టేజీపైౖ కాసేపు సందడి చేశారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన వేలాది మందిని మెహ్రీన్ తన హావభావాలతో అలరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ కాసమ్ షాపింగ్‌ మాల్‌ బ్రాంచ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. వివాహాది వేడుకలకు, అన్ని శుభకార్యాలకు కాసమ్ షాపింగ్ మాల్ అనుకూలమైనదని చెప్పారు. కాసమ్ షాపింగ్ మాల్ యాజమాన్యం కాసం మల్లికార్జున్, నమశ్శివాయ, కేదరనాథ్, శివప్రసాద్ మాట్లాడుతూ… తెలుగు ప్రజలకు నాణ్యమైన వస్త్రాలు సరసమైన ధరలకు అందిస్తున్నామని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో స్టోర్లు నిర్వహిస్తున్నామని, ఇది తమకు 11వ స్టోర్​ అని అన్నారు. కుటుంబంలోని అందరికీ నచ్చే విధంగా పట్టు ఫ్యాన్సీ శారీస్, ఉమెన్స్‌వేర్, కిడ్స్‌వేర్, అన్ని రకాల వెరైటీలు, డిజైన్స్ లభిస్తాయన్నారు. ఇలాంటి సంస్థలు గద్వాలకు రావడంతో పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాసమ్ షాపింగ్ మాల్ యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed