MLA Yennam Srinivas Reddy : ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..

by Sumithra |
MLA Yennam Srinivas Reddy : ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..
X

దిశ, ప్రతినిధి మహబూబ్ నగర్ : ఆశా వర్కర్ల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు గురువారం ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరానికి చొరవ చూపాలని కోరుతూ వారు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిని కలసి వినతిపత్రం సమర్పించారు.

తమకు కనీస వేతనం 18 వేలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పిస్తూ, రిస్క్ అలవెన్స్ చెల్లించాలని, పనిభారాన్ని తగ్గించాలనే తదితర డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్ళారు‌. వీలైనంత త్వరగా ఒక సమావేశం ఏర్పాటు చేసి మీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకు పోతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, ఆశాలు సాధన, యాదమ్మ, పద్మ, సౌజన్య, సునీత, భాగ్య, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed