- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వినాయక మండపం వద్ద ముస్లిం యువకుడి అన్నదానం
దిశ,మహమ్మదాబాద్ ; హిందూ ముస్లింలంతా సోదర భావంతో మెలగాలని రసూల్ ఖాన్ అన్నారు. నంచర్ల గ్రామంలోని బాపూజీ యువజన సంఘం వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణనాథునికి కాలనీ వాసులంతా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం యువకుడు రసూల్ ఖాన్ శనివారం రాత్రి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులంతా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమంలో హిందూ, ముస్లిం ఐక్యతకు అద్దంపట్టే ఈ ఘటన తో అంతటా హర్షాతి రేకాలు వ్యక్తమవుతున్నాయి.
మనమంతా మనుషులం మానవత్వమే మన మతం అని నిరూపించిన ముస్లిం సోదరుల పై గ్రామంలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమంలో మహమ్మదాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎం. నారాయణ, మండల మాజీ కో ఆప్షన్ నెంబర్ ఈసా బస్రావి, మాజీ ఎంపిటిసి బిక్షపతి, మాజీ ఉపసర్పంచ్ రాంచంద్రయ్య, ఎం. పుల్లయ్య, ముస్లిం యువకులు రసూల్ ఖాన్, ఖాజా బస్రావి ,ఖాజా పాషా, మహబూబ్ పాషా, ముస్లిం సోదరులకు యువజన సంఘం వినాయక ఉత్సవ కమిటీ సోదరులు అభినందనలు తెలియజేశారు. యువజన సంఘం సభ్యులు ఎం.నరేష్, బండారి రాజు, జి.నరేష్, హనుమంతు, పి. సురేష్ ,టి.కేశవులు, తదితరులు పాల్గొన్నారు.