- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Collector:ప్రజా పాలన దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి
దిశ, నారాయణపేట ప్రతినిధి : సెప్టెంబర్ 17న నిర్వహించే ప్రజా పాలన దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ లోని వీసీ హాల్లో ప్రజా పాలన దినోత్సవ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో నిర్వహించిన కోఆర్డినేషన్ మీటింగ్ లో కలెక్టర్ మాట్లాడుతూ..ఈనెల 17న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండా ఆవిష్కరణ ఉంటుందని, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్ రెడ్డి హాజరుకానున్నారని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలోకి జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల, డి.ఎస్.పి నల్లపు లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
చిన్నపిల్లల ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
సకాలంలో విధులకు హాజరై చిన్నపిల్లల కు వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. గురువారం ఉదయం నారాయణపేటలోని పీడియాట్రిక్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో విధులు నిర్వహించే డాక్టర్ లేకపోవడం పట్ల జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో హాజరై సేవలందించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణ అపరిశుభ్రంగా ఉండడం చూసి సిబ్బందికి తగు సూచనలు చేశారు. శానిటేషన్ సిబ్బంది ఎంతమంది ఉన్నారని అడిగారు. ఆస్పత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలన్నారు. చిన్నపిల్లలకు వైద్యం అందించే ఆసుపత్రిని తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.
మాదకద్రవ్యాల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
నారాయణపేట జిల్లాలో మాదకద్రవ్యాల నిషేధాన్ని పగడ్బంధీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లోని విసి హాల్ లో మాదకద్రవ్యాల నిషేధం(యాంటీ నార్కోటిక్)పై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో గంజాయి సాగు జరగకుండా వ్యవసాయ శాఖ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని జూనియర్, డిగ్రీ కళాశాలలో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని, ఆయా కమిటీల నేతృత్వంలో మాదకద్రవ్యాల నిషేధం పై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా కోస్గి, కొడంగల్ ప్రాంతాల్లో ఏర్పాటైన పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, డిగ్రీ జూనియర్ కళాశాలలో మాదకద్రవ్యాల నిషేధం పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. అలాగే పంట రుణాలపై బ్యాంకర్లతో ప్రజాపాలన కార్యక్రమ నిర్వహణ పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.