- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయిజ ప్రైవేటు ఆస్పత్రులపై కలెక్టర్ సీరియస్
దిశ, అయిజ : అయిజలోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్ నిర్వాహకులపై జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సీరియస్ అయినట్లు తెలిసింది. బుధవారం దిశ దిన పత్రికలో ప్రచురితమైన " అయిజ లో సిండికేట్ వైద్యం " అన్న వార్తకు ఆయన స్పందించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గురువారం సాయంత్రం జిల్లా వైద్యాధికారి శశికళ అయిజ లో ప్రైవేట్ నర్సింగ్ హోమ్ నిర్వాహకులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. రాత్రి సమయంలో వైద్యం కోసం వచ్చే ఏ ఒక్కరికి వైద్యం నిరాకరించినందుకు వీలు లేదని తేల్చి చెప్పారు. వైద్యం నిరాకరించినట్లు తేలితే సంబంధిత ఆస్పత్రి అనుమతులు రద్దు చేస్తామని ఆమె తెలిపారు. ప్రజలు కూడా నేరుగా ఇటువంటి విషయాల పై తమకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. జిల్లా వైద్యాధికారి అయిజ కు వచ్చి ఆస్పత్రి నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసిన విషయం ముందుగా మీడియాకు సమాచారం ఇవ్వక పోవడం పై పాత్రికేయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.