- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
DSP : నకిలీ పట్టాలు సృష్టించిన నిందితులు అరెస్ట్
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: రాష్ట్రంలోనే సంచలనంగా మారిన మహబూబ్ నగర్ పట్టణంలోని 523 సర్వే నెంబర్ లోని అక్రమ కట్టడాల కూల్చివేత కేసులో నకిలీ పట్టాలు సృష్టించి విక్రయించిన కేసును ఛేదించినట్లు మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నకిలీ పట్టాలను కొందరు తయారుచేసి అమాయకులను మోసం చేశారని అర్బన్ తహసీల్దార్ ఘన్సీరాం ఫిర్యాదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ ఫిర్యాదుపై తాము క్రైమ్ నెంబర్ 505/2024 గా నమోదు చేసి,దర్యాప్తు చేయగా ఏ1 రాయుడు,ఏ2 దేవా లుగా గుర్తించి ప్రశ్నించగా వారు నేరం ఒప్పుకున్నట్లు ఆయన తెలిపారు.నేరస్తుల నుంచి ఇంకా కొన్ని నకిలీ ఇండ్ల పట్టాలు, అగ్రిమెంట్ కాపీలు,కొన్ని జీరాక్స్ ఇండ్ల పట్టాలు, పట్టాల తయారీకి ఉపయోగించిన రెవెన్యూ అధికారుల ముద్ర, ప్రభుత్వ ముద్ర, ఒక బీఎండబ్ల్యూ కారు ను సీజ్ చేసినట్లు డీఎస్పీ వివరించారు. ఈ నేరాల్లో క్రిస్టియన్ పల్లి వార్డు కౌన్సిలర్ రాణి భర్త రాజు, మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ ల సహకారం ఉందని నిందితులు తెలిపినట్లు ఆయన తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరుచగా జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.