బీఆర్ఎస్ నాయకుల వార్తలు రాయొద్దని అచ్చంపేట ప్రెస్ క్లబ్ తీర్మానం..

by Kalyani |   ( Updated:2023-04-12 10:52:51.0  )
బీఆర్ఎస్ నాయకుల వార్తలు రాయొద్దని అచ్చంపేట ప్రెస్ క్లబ్ తీర్మానం..
X

దిశ, అచ్చంపేట: ఈ నెల 10వ తేదీన ఎన్ఎస్ యూఐ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలోని అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి సందర్భంగా అట్టి న్యూస్ కవరేజ్ చేసేందుకు వెళ్లిన మీడియాపై బీఆర్ఎస్ నాయకుడు మూడవత్ శివకుమార్ మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అతనిపై కేసు నమోదు చేయాలని మంగళవారం అచ్చంపేట పోలీసులకు ప్రెస్ క్లబ్ తరఫున ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బుధవారం అచ్చంపేట ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో సమావేశం నిర్వహించిన పాత్రికేయులు, అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు నియోజకవర్గం వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల వార్తలు రాయొద్దని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. తీర్మానంలో యూనియన్లకు సంబంధం లేకుండా అచ్చంపేట పాత్రికేయులు ప్రెస్ క్లబ్ తరఫున అన్ని మండలాల పాత్రికేయులకు సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం అందజేశారు.

సమస్య పరిష్కరించేవరకు అందరూ కలిసి రావాలని, ఐక్యత చాటుతూ పోరాటంలో కలిసి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు శ్రీనివాసులు రావు, భాస్కర్, బాలకృష్ణ, కాలూరి శ్రీనివాసులు, రాములు నాయక్, సహజ నందా, శ్రీనివాసరావు, వెంకటేష్, షఫీ, ప్రభాకర్, సుధాకర్, సాయిబాబు, బాలరాజు, జాంగిర్, రవికుమార్, నేనావత్ రాములు తదితరులు పాల్గొన్నారు.

Read more:

దిశ చేతిలో సుఖేశ్ చంద్రశేఖర్ వాట్సాప్ స్క్రీన్ షాట్లు....రూ.15 కోట్లు ముట్టింది ఎమ్మెల్సీ కవితకేనని వెల్లడి

Advertisement

Next Story

Most Viewed