MLA Vamsikrishna : ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు జలహారతిలో అచ్చంపేట ఎమ్మెల్యే..

by Sumithra |
MLA Vamsikrishna : ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు జలహారతిలో అచ్చంపేట ఎమ్మెల్యే..
X

దిశ, అచ్చంపేట : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి గురువారం శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృష్ణమ్మకు పూజలు చేసి జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని మర్యాదపూర్వంగా కలిసి శాలువా బోకే అందజేసి సత్కరించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ ఏపీ సీఎంకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచనలు సలహాలతో పలు అంశాలకు సంబంధించిన వినతి పత్రాలను ప్రాజెక్టు వద్దనే అందజేశారు.

వినతులు ఏఏ విషయాల పై...

ప్రధానంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కృష్ణానది పరివాహక ప్రాంతమైన నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మద్దిమడుగు శ్రీపతి ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో రెండు తెలుగు రాష్ట్రాల అనుసంధానం చేసే హైలెవెల్ బ్రిడ్జి వంతెనను ఏర్పాటు చేసేందుకు సహకారం ఉండాలని తెలిపారు. శ్రీశైలం దేవస్థానం పాలకమండలిలో అచ్చంపేట వారికి అవకాశం కల్పించాలని కోరారు. శ్రీశైలంలో తెలంగాణ అతిథి గృహ నివాసానికి స్థలం కేటాయించమని కోరారు. ఆరాధ్య దైవమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి శ్రీశైలం క్షేత్రంలో నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల ప్రాంతంలో అమ్రాబాద్, మన్ననూర్ లో ఉంటున్న చెంచులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర వంతెన మాచర్ల నుండి మద్దిమడుగు దేవస్థానం వరకు హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి చొరవ తీసుకోవాలని కోరారు.

అనంతరం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి మెమోరాండం ఇచ్చారు. ఎమ్మెల్యే కోరిన విషయాల పట్ల ఏపీ సీఎం సానుకూలంగా స్పందించారని, పై అంశాలను చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఏపీ సీఎం సూచించారని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. అన్ని అనుకున్నట్టుగా సవ్యంగా జరిగితే రెండు తెలుగు రాష్ట్రాల దూర భారం తగ్గడంతో పాటు వ్యాపారం ఉపాధి ఇతర అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రధానంగా అన్ని రంగాల్లో వెనుకబడ్డ అచ్చంపేట నియోజకవర్గం మరింత అభివృద్ధి చెంది అవకాశం ఉందని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed