AP CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే..

by Sumithra |
AP CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే..
X

దిశ, అచ్చంపేట : శ్రీశైలం ప్రాజెక్టును గురువారం మధ్యాహ్నం ఏపీ సీఎం నారా చంద్రబాబు సందర్శించారు. అలాగే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కూడా శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేసే కృష్ణా నది పరివాహక ప్రాంతం నాగర్ కర్నూల్ జిల్లా మద్దిమడుగు వద్ద కృష్ణా నదిపై వంతెన ఏర్పాటు చేస్తే.. రెండు రాష్ట్రాల దూర భారం పెరగడంతో పాటు వ్యాపారం రాకపోకలు జరగడంతో అభివృద్ధి చెందుతుందని అందుకు సానుకూలంగా ఆలోచన చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లి.. వంతెన నిర్మాణం ఏర్పాటు విషయం పై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.

Advertisement

Next Story