జలుబుతో ఆస్పత్రికి వచ్చిన 32 ఏళ్ల యువతి మృతి

by Mahesh |   ( Updated:2024-12-14 12:14:44.0  )
జలుబుతో ఆస్పత్రికి వచ్చిన 32 ఏళ్ల యువతి మృతి
X

దిశ, నాగర్ కర్నూల్ : వైద్యం కోసం వచ్చి 32 ఏళ్ల యువతి మృతి చెందిన ఘటన శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. యువతి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామానికి చెందిన వెంకటమ్మ, బాలరాజు దంపతుల కుమార్తె జ్యోతి (32) కు జలుబు తో బాధపడుతూ జిల్లా కేంద్రంలొని పుల్లారెడ్డి హాస్పిటల్‌కు చికిత్స నిమ్మితం వచ్చింది. అనంతరం యువతిని పరీక్షించిన డాక్టర్ కొద్దిసేపు ఆక్సిజన్ పెట్టి టాబ్లెట్స్ రాసి ఇచ్చారు. ఆ టాబ్లెట్ వేసిన కొద్దిసేపటికి అస్వస్థతకు గురై హాస్పిటల్ ముందే మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు యువతి మృతదేహాన్ని ఉంచి ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై హాస్పిటల్ యాజమాన్యం స్పందించాల్సి ఉంది. కాగా మృతురాలు జ్యోతి కి న్యాయం చేయాలని బి.ఎస్.పి నాయకులు మాజీ జిల్లా అధ్యక్షులు పృద్విరాజ్, నాయకులు కళ్యాణ్, రామకృష్ణ మృతురాలు అన్న తదితరులు డిమాండ్ చేస్తూ హాస్పిటల్ ముందు బయట కూర్చుని ఆందోళన చేస్తున్న బీఎస్పీ నాయకులను పోలీసులు స్టేషన్కు తరలించారు. మా బిడ్డకు న్యాయం చేయండి అని మృతురాలి తల్లి పోలీసుల కాళ్ళ పై వేడుకున్న కనికరించకుండా జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి అన్నను అని చెప్పినా స్టేషన్ కు తరలించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

Advertisement

Next Story

Most Viewed