- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
510 బస్తాల నల్లబెల్లం స్వాధీనం
దిశ, గద్వాల: తమిళనాడు రాష్ట్రం సేలం నుంచి జోగులాంబ గద్వాల జిల్లాలోని పలు ప్రాంతాలలో అక్రమంగా నల్ల బెల్లం సరఫరా చేస్తున్న క్రమంలో గద్వాల ఎక్సైజ్, డిటిఎఫ్ బృందం దాడులు నిర్వహించారు. 510 బస్తాలలో రూ.10 లక్షలు విలువ చేసే 153 క్వింటాళ్ల నల్ల బెల్లం స్వాధీనం చేసుకుని, లారీని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. గద్వాల్ ఎక్సైజ్ సీఐ గోపాల్ కథనం మేరకు సోమవారం ధరూర్ మండలం పరిధిలోని పలు గ్రామాలలో లారీలో నల్లబెల్లం తెచ్చి విక్రయిస్తున్నట్లు గద్వాల్ ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందడంతో కొత్తపాలెం స్టేజ్ వద్ద ఆ లారీని తనిఖీ చేయగా అందులో నల్లబెల్లం గుర్తించారు. తమిళనాడుకు చెందిన మోహన్ రాజ, సురేష్ శెట్టి అనే ఇద్దరు వ్యక్తులు సేలం నుంచి లారీలో నల్లబెల్లం తెచ్చి గద్వాల్ జిల్లాలో ధరూర్ మండలంలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని గద్వాల్ ఎక్సైజ్ సీఐ గోపాల్ తెలిపారు. 510 బస్తాలలో సుమారు రూ.10లక్షలు విలువ చేసే 153క్వింటాళ్ల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు పేర్కొన్నారు.