ఆరె కులస్తులను ఓబీసీ జాబితాలో చేర్చాలి

by Javid Pasha |
ఆరె కులస్తులను ఓబీసీ జాబితాలో చేర్చాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆరె కులస్తులను ఓబీసీ జాబితాలో చేర్చాలని ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మేడిపల్లిలో శనివారం తెలంగాణ ఆరె కుల సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించారు. తొలుత నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కిషన్ రావు మాట్లాడుతూ.. కుల సంఘంలో విషాన్ని చిమ్మడం, రాజకీయతత్వం ఉండకూడదన్నారు. అది రేపటి తరానికి పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందన్నారు. కుల సంఘంలో వివిధ రాజకీయ పార్టీల వారు ఉంటారని, కుల సంఘాలకు ఏ రాజకీయ పార్టీల ప్రభుత్వాలు మంచి చేసిన ఆ సంఘాలకు విషయాలను చెప్పుకోవడానికి ఉంటుందన్నారు. నియంతృత్వ పోకడలు కుల సంఘంలో ఒకరి జేబు సంస్థగా మార్చడానికి, సమన్వయ లోపం ,గౌరవ, ప్రతిష్టలకు భంగం కలిగించడం, బురద చల్లుకోడాలు, పత్రికలకు అవాస్తవాలు ప్రచారం చేసుకోవడం మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. త్వరలోనే రాష్ట్ర కమిటీ సమావేశం జిల్లాల పర్యటన ఓబీసీ సాధన కార్యచరణ ఉంటుందన్నారు. ఉప్పల్ భగయత్ లో ఆత్మగౌరవ భవనానికి రూ.50 కోట్ల విలువ చేసే ఎకరం స్థలం, నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

నూతన కార్యవర్గం ఎన్నిక..

ఆరె కు సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రెకెంధర్ చలపతిరావు, ప్రధాన కార్యదర్శిగా వరికెల శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులుగా దాపాడి బాలాజీ రావు, నిట్టె బాలరాజు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఏసికా శంకర్రావు, ఉపాధ్యక్షులుగా కృష్ణాజి, శ్రీనివాస్, జెండా అంబయ్య, సత్యం, కంటెడి రామోజీని ఎన్నుకున్నారు. అదేవిధంగా ఆరె కుల యువత రాష్ట్ర అధ్యక్షుడిగా కౌడగొని శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ధోయపడి శ్రీనివాస్, అముదాపురం శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా మోర్తాల రాంబాబు, గ్రేటర్ హైదరాబాద్ ఆరే కుల యువత అధ్యక్షుడిగా దోనె శివాజీతో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

Advertisement

Next Story