- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
T Square: న్యూయార్క్ టైమ్ స్క్వేర్ తరహాలో.. హైదరాబాద్లో ‘టీ-స్క్వేర్’
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో మరో ఐకానిక్ టవర్ రాబోతుంది. అమెరికాలోని న్యూయార్క్లో ఫేమస్ అయిన టైమ్స్ స్క్వేర్ తరహాలో టీ స్క్వేర్ను నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ ఐకానిక్లా కనిపించే విధంగా.. తెలంగాణ స్క్వేర్ పేరుతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దాని కోసం తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) టెండర్లను ఆహ్వానించింది. నగరంలోని రాయదుర్గం, హైటెక్ సిటీ ప్రాంతాల్లో టీ స్క్వేర్ నిర్మాణం చేపట్టనుంది.
టీ స్క్వేర్ ప్రాజెక్టు కోసం ఆగస్టు 9 వ తేదీ వరకు బిడ్లను సమర్పించేందుకు చివరి తేదీని టీజీఐఐసీ ప్రకటిచింది. ఆర్కిటెక్ కమ్ ట్రాన్సాక్షన్ అడ్వైజర్ ఎంపిక విధానం క్వాలిటీ కమ్ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ (క్యూసీబీసీ) అని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు లక్ష్యం సమాజానికి సౌకర్యవంతమైన, ఆకర్షణీయమైన వాతావరణాన్ని అందించడం అని తెలిపింది.
కాగా, న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ గురించి అందరికీ తెలిసిందే. ఒక ప్రధాన వాణిజ్య కూడలి, ఫేమస్ పర్యాటక, వినోద కేంద్రం. వీడియో బిల్ బోర్డులతో ప్రకటనలతో 24 గంటలు ప్రకాశవంతంగా వెలిగిపోతుంది. ఇక్కడికి ప్రతి సంవత్సరం 50 మిలియన్ల మంది సందర్శిస్తుంటారు అని నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే టీ స్క్వేర్ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.