- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TGSRTC : ఆర్టీసీ బస్‌లో పుట్టిన చిన్నారికి లైఫ్ టైం ఉచిత ప్రయాణం
దిశ, డైనమిక్ బ్యూరో: రాఖీ పౌర్ణమి నాడు గద్వాల డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారికి జీవిత కాలంపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్‌పాస్‌ను అందిస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్ లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్‌ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ చిన్నారికి బర్త్ డే గిప్ట్‌గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్‌ను మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే, కండక్టర్‌తో పాటు గర్భిణి డెలివరీకి సాయం చేసిన వనపర్తిలోని మదర్ అండ్ చైల్డ్ గవర్నమెంట్ హాస్పటల్ స్టాఫ్ నర్స్ అలివేలు మంగమ్మకు డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లోనూ ఏడాది పాటు ఉచితంగా ప్రయాణించే బస్‌పాస్‌ను సంస్థ అందించింది.
కాగా, బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు పురిటినొప్పులతో బాధపడుతున్న గర్బిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న గద్వాల్ డిపోనకు చెందిన కండక్టర్ భారతి, డ్రైవర్ అంజిలతో పాటు నర్సు అలివేలు మంగమ్మను హైదరాబాద్ బస్ భవన్‌లో మంగళవారం ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వారిని ఘనంగా సన్మానించి.. నగదు బహుమతులు అందజేశారు. అనంతరం, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో ఏడాది పాటు ఉచితంగా ప్రయాణించే బస్ పాస్‌ను నర్సు అలివేలు మంగమ్మకు, చిన్నారి ఉచిత బస్ పాస్‌ను గద్వాల డిపో మేనేజర్ మురళీకృష్ణకు అందజేశారు. సకాలంలో కాన్పు చేసిన కండక్టర్ భారతి, నర్సు అలివేలు మంగమ్మ, డ్రైవర్ అంజి సేవలను సజ్జనార్ మెచ్చుకున్నారు. ఆపద సమయంలో సేవాతర్పరతను ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం గొప్ప విషయమని అన్నారు.