- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కల్వకుంట్ల కుటుంబాన్ని ఓడిద్దాం.. తెలంగాణను రక్షిద్దాం’
దిశ, తెలంగాణ బ్యూరో : కల్వకుంట్ల కుటుంబాన్ని ఓడించి.. తెలంగాణను రక్షించుకుందాం అనే నినాదంతో తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన యాత్రను నేడు(గురువారం) గజ్వేల్‌లోని తెలంగాణ తల్లి విగ్రహం నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక, తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యుల చైర్మన్ ఎం రఘుమారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక, ఉద్యమకారుల ఐక్యవేదిక, దళిత సంఘాల జేఏసీ, యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో యాత్ర చేపడుతున్నామని వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటుకు సబ్బండ వర్గాలు రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసిందే నీళ్లు, నిధులు, నియామకాలు, స్వపరిపాలన అని, అవి నేడు ఎక్కడ? అని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం కోసం పదవులను కూడా వదులుకోని వ్యక్తులతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమా? అని ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహులతో నిండిన తెలంగాణ ఉద్యమపార్టీతో అభివృద్ధి సాధ్యమా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణ త్యాగం చేసిన అమరుల కుటుంబ సభ్యులకు గుర్తింపు లేదని, ఆత్మహత్యలకు ప్రేరేపించిన వారికి మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు అని మండిపడ్డారు. హ్యాట్రిక్ కొట్టాలని పగటి కలలు కంటున్న కేసీఆర్‌ను, కేసీఆర్ కుటుంబాన్ని ఓడించడానికే యాత్ర అన్నారు. జరుగబోయే ఎన్నికలు కల్వకుంట్ల కుటుంబానికి, నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు మధ్య జరుగుతున్నాయన్నారు.