మహిళపై చిరుత పులి దాడి.. స్పందించిన మంత్రి సురేఖ

by Pooja |   ( Updated:2024-12-14 11:52:43.0  )
మహిళపై చిరుత పులి దాడి.. స్పందించిన మంత్రి సురేఖ
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న ఆదిలాబాద్ (Adilabad) జిల్లా బజార్హత్నూర్ మండలం డెడ్రా గ్రామంలో అర్క భూంబాయి (52) అనే మహిళపై ఉదయం చిరుత పులి (Cheetah) దాడి చేసింది. పులి దాడిలో (attack) గాయపడిన మహిళను రిమ్స్ హాస్పిటల్ కు (Rimes Hospital) తరలించి చికిత్స అందించారు. కాగా ఈ ఘటనపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) స్పందించారు. మహిళపై చిరుత పులి దాడి చేసి గాయపరచిన ఘటన పట్ల మంత్రి సురేఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే మహిళకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం ప్రకటించారు. అనంతరం పీసీసీఎఫ్ డోబ్రియాల్‌తో ఫోన్‌లో మాట్లాడి చిరుత దాడికి సంబంధించిన వివరాలు ఆరా తీశారు. మహిళ తన వ్యక్తిగత పనుల నిమిత్తం గ్రామం చివరకు వెళ్ళగా.. అక్కడ మహిళ పై చిరుత దాడి చేసినట్లు పీసీసీఎఫ్ అధికారి మంత్రి సురేఖకు తెలిపారు. పశువుల మంద మేత మేస్తున్న సమయంలో వాటి పై దాడి చేయబోయిన చిరుత మహిళ కదలికలను గుర్తించి అకస్మాత్తుగా దాడి చేసిందని.. దాడికి పాల్పడిన చిరుత మహారాష్ట్ర సరిహద్దు నుండి ఆదిలాబాద్ లోకి ప్రవేశించినట్లు తెలిపారు. చిరుత దాడి నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, చిరుత కదలికలపై నిఘా పెట్టాలని మంత్రి సురేఖ పీసీసీఎఫ్‌ను ఆదేశించారు.

Advertisement

Next Story