Left Leaders: ఆ విషయం సీఎం రేవంత్ స్పష్టంగా చెప్పారు

by Gantepaka Srikanth |
Left Leaders: ఆ విషయం సీఎం రేవంత్ స్పష్టంగా చెప్పారు
X

దిశ, వెబ్‌డెస్క్: లగచర్ల ఘటన(Lagacharla incident)పై సీపీఎం(CPIM) నేత తమ్మినేని వీరభద్రం, సీపీఐ(CPI) కూనంనేని సాంబశివ రావులు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలిశారు. సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నవంబర్ 21వ తేదీన లగచర్లలో పర్యటించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని తెలుకున్నట్లు చెప్పారు. ఇవాళ సీఎం రేవంత్‌ను కలిసి నివేదిక అందజేసినట్లు వెల్లడించారు. దాడితో సంబంధం లేదని వ్యక్తులను విడుదల చేయాలని కోరారు. ఫార్మాసిటీ(Pharma City) కోసం లగచర్ల భూములు తీసుకోవడం లేదని సీఎం రేవంత్ స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు.

అనంతరం లగచర్ల(Lagacharla)లో పోలీస్ క్యాంపులు ఎత్తివేయాలని కలెక్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాగా, అంతకుముందు లగచర్లలో ఫార్మా సిటీ పేరుతో గిరిజనుల భూములు లాక్కోవడం అన్యాయమన్నారు. గతంలోనే ఫార్మా సిటీ కోసం 13 వేల ఎకరాలు సేకరించారు. దానిపై రేవంత్‌ రెడ్డి వైఖరేంటో చెప్పాలన్నారు. ఇప్పుడు మళ్లీ లగచర్లలో 13 వందల ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి పాలన అప్రజాస్వామికంగా కొనసాగుతుందని విమర్శించారు.




Advertisement

Next Story

Most Viewed