- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు పాలమూరులో CM KCR స్పీచ్‌పై అంతా ఉత్కంఠ!
లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ స్పందించలేదు. కానీ ఇప్పుడు కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. విచారించేందుకు మంగళవారం ఇంటికి రానుంది. అయితే అంతకుముందే పాలమూరులో మహబూబ్ నగర్ కలెక్టరేట్ ను సీఎం ప్రారంభించనున్నారు. ఆ తర్వాత బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ఈ స్పీచ్ లో లిక్కర్ స్కామ్, కూతురుకు నోటీసులపై ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తున్నది. కేంద్రానికి కౌంటర్ ఇస్తూనే, దర్యాప్తు సంస్థలపై దాడి చేసే అవకాశముంది.
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర దర్యాప్తు సంస్థల సోదాలు, విచారణలతో ఇప్పటికే టీఆర్ఎస్ లీడర్లు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను సాక్షిగా విచారించేందుకు సీబీఐ రెడీ అయింది. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థల వరుస దాడులపై సీఎం కేసీఆర్ పబ్లిక్ మీటింగ్ లో ఏం చెప్తారోననే ఉత్కంఠ నెలకొన్నది. ఇప్పటికే మోడీ, అమిత్ షా విషయంలో కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. మునుగోడు బై ఎలక్షన్ టైమ్ లో జరిగిన బహిరంగ సభలోనే ఘాటుగా స్పందించారు. ఇప్పుడు వారిద్దరిపై పబ్లిక్ మీటింగ్ లో ఏ మేరకు తిట్ల దండకం అందుకుంటారోననే ఆసక్తి నెలకొంది. తాజాగా లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ ప్రమేయం కూడా ఉందని తరుణ్ చుగ్ ఆరోపించారు. బలమైన ఆధారాలు ఉండటంతోనే బీజేపీ అధిష్టానం ఆయనతో మాట్లాడించిందనే చర్చ జరుగుతున్నది. ఒకవైపు తన కూతురు కవితకు సీబీఐ నోటీసులు, అదే కేసులో తన ప్రమేయం ఉందని చెప్పడంపై కేసీఆర్ కోపంగా ఉన్నట్టు ప్రగతిభవన్ కు దగ్గరగా ఉండే లీడర్లు చెప్తున్నారు. ఆ కోపం మొత్తాన్ని పాలమూరు పబ్లిక్ మీటింగ్ లో చూపేంచే చాన్స్ ఉందని చర్చ జరుగుతున్నది.
'సిట్' తో బీజేపీపై ఎటాక్
బీజేపీ కేంద్ర నాయకత్వంపై ఎటాక్ చేయడానికి ఫామ్ హౌజ్ కేసు సరైన అస్త్రం అనే భావనలో కేసీఆర్ ఉన్నట్టు తెలిసింది. ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ కేంద్ర నాయక త్వం చేసిన ప్రయత్నాలను సిట్ ద్వారా దేశ ప్రజలకు వివరించే ప్లాన్ లో ఉన్నట్టు సమాచారం. త్వరలో చేపట్టనున్న ఢిల్లీ పర్యటనలో అదే ప్రధాన ఎజెండాగా కేసీఆర్ పెట్టుకున్నట్టు తెలిసింది. మరోవైపు ఇదే కేసులో అమిత్ షాకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
Also Read....