- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఘనంగా లాల్ దర్వాజ బోనాలు.. తొలిబోనం సమర్పంచిన మంత్రి తలసాని

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో లష్కర్ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం నాలుగు గంటల నుంచే సికింద్రబాద్ ఉజ్జయిని మహాంకాళి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పట్టువస్త్రాలతో పాటు తొలి బోనం సమర్పించారు. భక్తులు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు.
భారీ సంఖ్యలో పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 175 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఏర్పాట్లలో భాగంగా ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. భక్తుల కోసం మొత్తం ఆరు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. పలు మార్గాల్లో ఆలయానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తుల కోసం, వీఐపీల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. దాతల పాస్‌ల కోసం ప్రత్యేకంగా మరో క్యూలైన్‌ను ఏర్పాటు చేశారు.