లేడీ డాన్​ హల్‌చల్.. లబ్ధిదారులకు తెలియకుండానే ప్లాట్స్ సేల్

by Rajesh |   ( Updated:2023-06-23 03:34:09.0  )
లేడీ డాన్​ హల్‌చల్.. లబ్ధిదారులకు తెలియకుండానే ప్లాట్స్ సేల్
X

దిశ, ఖమ్మం బ్యూరో: రూరల్ ​మండలం వెంకటగిరి ఇందిరమ్మకాలనీ ఫెస్‌-2లో ఓ లేడీ డాన్​చక్రం తిప్పుతున్నది. ఇక్కడ వైఎస్ఆర్ ​హాయాంలో పేదలకు 72గజాల ఇండ్ల స్థలం ఇచ్చి అందులో ఇల్లు కట్టకునేందుకు ఇందిరమ్మ ఇల్లు సైతం మంజూరు చేశారు. చాలా మంది పేదలు డబ్బులు లేకపోవడంతో ప్లాట్లను ఖాళీగానే వదిలేశారు. వీటిపై కన్నేసిన లేడీడాన్ తన కంటికి కనిపించిన ఖాళీ ప్లాట్లను యథేచ్ఛగా విక్రయిస్తూ లక్షలు సంపాదిస్తున్నది. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్లాట్లను అమ్మినట్లు తెలుస్తున్నది. ఆమె వద్ద కొనుగోలు చేసిన వారికి ఎటువంటి ఉండవు. తీరా ఆమె చేసిన మోసం తెలుసుకుని లబోదిబోమంటున్నారు. కబ్జాలు, అమ్మకాలపై ఎవరైనా ఇదేంటి అని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతూ వారిని బెదిరింపులకు గురిచేస్తున్నది.

ప్రస్తుతం ఖమ్మం నగరానికి అనుకుని ఉన్న రూరల్​ మండలం వెంకటగిరి గ్రామం నుంచి గ్రీన్‌ ఫీల్డ్ ​హైవేతో పాటు, కోదాడ‌‌–మహబూబాబాద్‌కు జాతీయ రహదారులు నిర్మాణం జరుగుతుండంతో ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లకు సైతం రెక్కలొచ్చాయి. దీంతో అక్రమణదారులకు ఖాళీ జాగా కనపడితే చాల లబ్ధిదారులకు తెలియకుండానే వారి ప్లాట్లనే వేరే వారికి విక్రయిస్తూ లక్షల్లో జేబులు నింపుకుంటున్నారు. కాలనీలో ఓ మహిళా శివతాండవం చేస్తూ ప్రభుత్వ ప్లాట్లను అక్రమించి అమాయకులకు అంటగడుతున్నది. ఒక్కోప్లాట్‌ను రూ.4లక్షల నుంచి 6లక్షల వరకు విక్రయిస్తుంది.

కాలనీలో ఓ లబ్ధిదారుడి ప్లాట్‌ను వారికి తెలియకుండా ఈసారధి అనే వ్యక్తికి విక్రయించింది. దీనికి ఎటువంటి పత్రాలు లేవు. నాగరాజు అనే వ్యక్తి ఖాళీ ప్లాట్​ఉండటంతో అతడికి తెలియకుండానే వేరేవారికి విక్రయించింది. ఇది తెలుసుకున్న లబ్ధిదారుడు నాగరాజు న్యాయపోరాటం చేసి తన ప్లాట్​ను దక్కించుకున్నాడు. ఇదే కాలనీకి చెందిన నక్క వెంకటలక్ష్మికి చెందిన ప్లాట్‌ను ఆక్రమించి లేడీ డాన్​ఇల్లు కట్టింది. లబ్ధిదారులు వచ్చి అడిగితే నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటూ పరుష పదజాలంతో దూషిస్తొంది. ఇదే కాలనీకి చెందిని సొమ సత్యనారాయణ కుటుంబ సభ్యులపై నాలుగేళ్ల క్రితం కేసు పెట్టింది. ఇలా ఎంతో మందిని ఇబ్బందులు గురిచేయడమే కాకుండా ప్రభుత్వ ప్లాట్లను యథేచ్ఛగా విక్రయిస్తున్నది. విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.

తెలియకుండానే విక్రయాలు..

ఇక్కడ విచిత్రం ఎంటంటే.. సహజంగా లబ్ధిదారుడే ప్లాట్‌ను విక్రయిస్తే చెల్లదని పట్టాలోనే ఉంటుంది. అటువంటిది ఓ మహిళ పట్టదారుడికి తెలియకుండానే అమాయకులకు విక్రయించి, లక్షలు సంపాదించడమే పనిగా పెట్టుకున్నది. ఇక్కడ అడిగితే కేసుల పెడుతానని, లేకపోతే కుటుంబ సభ్యులు వచ్చి దాడి చేయడం పరిపాటిగా మారాయి.

కొన్నాక తెలిసింది..

సారథి, కాలనీవాసి.

నాకు కాలనీలో ఓ మహిళ ప్లాట్ నాదేనంటూ విక్రయించింది. తీరా కొన్నాక ఆ ప్లాట్ ​ఆమెది కాదని తెలిసింది. అడిగితే ఏమికాదు నేను ఉన్నా అంటూ.. జవాబు ఇస్తున్నది. నిజమైన లబ్ధిదారులు వస్తే నా పరిస్థితి ఎంటో అర్థం కావడం లేదు. కష్టపడి సంపాదించిన సొమ్ముతో ప్లాట్‌ను కొని, ఇల్లు కట్టుకున్న.

నాప్లాట్ అక్రమించారు..

నక్క వెంకటలక్ష్మి. లబ్ధిదారురాలు..

కాలనీలో ఓ మహిళ ప్లాట్‌ను అక్రమించి ఇల్లు కట్టుకున్నది. అడిగితే దాడి చేస్తున్నది. పేదవారి ప్లాట్‌ను అక్రమించడమే కాకుండా ఇల్లు నిర్మాణం చేపట్టింది. అధికారులు చర్యలు తీసుకుని ప్లాట్‌ను ఇప్పించాలి.

Advertisement

Next Story

Most Viewed