- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మునుగోడులో మేం లేకపోతే మీ పరిస్థితి ఏందీ..? కేసీఆర్‌పై కూనంనేని సీరియస్
దిశ, వెబ్‌డెస్క్: మనుగోడు ఉపఎన్నికలో మద్దతు ఇవ్వాలని సీఎం కేసీఆరే కోరారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు క్లారిటీ ఇచ్చారు. సీపీఐ కార్యాలయంలో లెఫ్ట్ పార్టీల మీటింగ్ జరిగింది. ఈ సమావేశం అనంతరం కూనంనేని మాట్లాడుతూ.. బీజేపీ దూకుడుని మునుగోడు ఉపఎన్నికలో నిలువరించాలనేది అప్పుడు మా విధానమని.. ఇందులో భాగంగానే అప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో బీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చామని చెప్పారు. బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలు కలిసే ఉంటాయని సీఎం కేసీఆరే చెప్పారన్నారు.
రైతు సమస్యలపై కూడా సీఎం కేసీఆర్ తమతో చర్చించారన్నారు. కేసీఆర్‌కు ఉత్సాహం వచ్చినప్పుడు ఫోన్‌లు కూడా చేశారని.. కానీ తర్వాత ఏమైందో మాకు తెలియదన్నారు. లెఫ్ట్ పార్టీలు లేకపోతే మునుగోడులో మీ పరిస్థితి ఏమయ్యేది అని ఈ సందర్భంగా కూనంనేని ప్రశ్నించారు. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ గెలిస్తే మీరు ప్రమాదంలో పడేవారు కాదా అని నిలదీశారు. ప్రస్తుతం బీజేపీతో కేసీఆర్‌కు సఖ్యత కుదిరిందని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇక, వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగ పోటీ చేయాలని కామ్రేడ్లు నిర్ణయం తీసుకున్నారు. కాగా, లెఫ్ట్ పార్టీలతో పొత్తు ఉంటుదన్న కేసీఆర్.. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన మాత్రం వారిని సంప్రదించకుండానే చేశారు. పొత్తులో భాగంగా లెఫ్ట్ పార్టీలు అడిగిన సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడమే కాక.. ఇక, లెఫ్ట్ పార్టీలతో పొత్తు ఉండదని కుండబద్దలు కొట్టారు. దీంతో భవిష్యత్ కార్యచరణ్‌పై చర్చించేందుకు ఇవాళ కామ్రేడ్లు సమావేశమయ్యారు.