- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR : ఫార్ములా-1 రేసింగ్ లో అవకతవకల వ్యవహారంపై కేటీఆర్ వివరణ
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మీడియా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో నిర్వహించిన ఫార్ములా-1 రేసింగ్(Formula E-Car Racing) లో అవకతవకలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు ఈ సమావేశం నిర్వహించారు. 2022 డిసెంబర్, 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్(Hyderabad)లో హుస్సేన్‌సాగర్ చుట్టూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2.8 కి.మీ. ట్రాక్‌లో దేశంలో మొదటిసారిగా ఫార్ములా-ఈ కార్ల రేసింగ్ నిర్వహించారు. సీజన్-9 ఫార్ములా-ఈ రేస్ నిర్వహణకు రూ.200 కోట్లు ఖర్చయింది. ఇందులో ఈవెంట్ నిర్వాహక సంస్థలైన గ్రీన్‌కో(Green Co) రూ.150 కోట్లు, హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ రూ.30 కోట్లు ఖర్చుచేశాయి. రహదారులు, ఇతర మౌలిక వసతులకు హెచ్‌ఎండీఏ రూ.20 కోట్లు ఖర్చు చేసింది. ఇది విజయవంతం కావడంతో 2024 ఫిబ్రవరి 10న మరోసారి (సెషన్-10) నిర్వహించేందుకు ఫార్ములా-ఈ ఆపరేషన్(FEO)తో ఎంఏయూడీ 2023 అక్టోబరులో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు హెచ్‌ఎండీఏ రూ.55 కోట్లు ఎఫ్‌ఈవోకు చెల్లించింది. ఈ ఈవెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్‌గా ఉండి.. ఖర్చంతా ప్రైవేటు సంస్థలైన గ్రీన్ కో, ఫార్ములా-ఈనే భరించాల్సి ఉంది. కానీ.. గత సీజన్‌లో ప్రధాన భాగస్వామిగా ఉన్న గ్రీన్ కో సంస్థను తొలగించి దానిస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఉండేలా సీనియర్ ఐఏఎస్ అరవిందకుమార్ నిర్ణయం తీసుకున్నారు.
కాగా ఫార్ములా- ఈ రేసింగ్ కు సంబంధించి రూ. 55 కోట్లు విదేశీ సంస్థలకు చెల్లించడంలో జరిగిన అవకతవకల్లో మాజీ మంత్రి హస్తం ఉందని ఏసీబీ గుర్తించింది. గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (MIUD) స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఐఏఎస్ అరవింద్ కుమార్ సమక్షంలోనే ఫార్ముల ఈ కార్ రేసింగ్ కోసం విదేశీ సంస్థలకు నిధులు దారి మళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఎస్, ఆర్థిక శాఖల అనుమతులు లేకుండా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఫోన్ ఆదేశాలతోనే ఈ కార్ రేసింగ్ నిర్వాహణ సంస్థకు రూ.55 కోట్లు విడుదల చేసినట్లుగా అరవింద్ కుమార్ నోట్ ఫైల్ రాసినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కూడా అమలులో ఉంది. కాగా ఈ స్కామ్ లో ఐఏఎస్ అరవింద్ కుమార్ సహా పలువురు మున్సిపల్ శాఖ అధికారులకు నోటీసులిచ్చేందుకు లీగల్ ఒపినీయన్ తో ఏసీబీ సిద్ధమైంది. అటు అరవింద్ కుమార్ ను విచారించేందుకు సీఎస్ శాంతికుమారి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, విచారణలో అధికారులు ఇచ్చే స్టేట్మెంట్స్ ఆధారంగా మాజీ మంత్రికి ఏసీబీ నోటీసులిచ్చి విచారించనున్నదని సమాచారం.
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో కోట్లలో అవినీతి జరిగిందని, మరీ కొద్ది రోజుల్లో మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నట్టు మీడియా వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో.. ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఫార్ములా ఈ రేసింగ్ సమయంలో మున్సిపల్ శాఖ మంత్రిగా తానే ఉన్నానని, ఎఫ్‌ఈవోకు డబ్బులు చెల్లించడం వాస్తవమే అని, అవేమీ నాకోసం ఖర్చు చేయలేదని, తెలంగాణ రాజధాని హైదరాబాద్ పేరును అంతర్జాతీయస్థాయిలో నిలిపేందుకు తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు. హైదరాబాద్ పేరు ప్రపంచ పటంలో నిలిపినందుకా నా మీద బురద జల్లాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు తప్ప.. ఇందులో మరొకటి లేదని కేటీఆర్ అన్నారు. మహా అయితే అరెస్ట్ చేస్తారేమో.. అవినీతిని మాత్రం నిరూపించలేరు.. ఎందుకంటే అసలు అవినీతి ఏం జరగలేదు కాబట్టి అని తెలియ జేశారు.