- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
KTR Vs Kavitha: కవిత వర్సెస్ కేటీఆర్.. ‘సీఎం’ అంటూ పోటాపోటీ నినాదాలు
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ కార్యకర్తల నుంచి ఇంట్రస్టింగ్ నినాదాలు వినిపిస్తున్నాయి. వాటిని వింటుంటే పార్టీలో ‘కేటీఆర్ వర్సెస్ కవిత’ అనే వార్ కొనసాగుతున్నదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్ సర్వత్రా ఆసక్తిని రేపుతున్నది. స్వరాష్ట్రంలో రెండు దఫాలుగా అప్రతిహతంగా సాగిన కారు పార్టీ జోరుకు 2023 అసెంబ్లీ ఎన్నికలతో బ్రేక్ పడింది. 2024లోను ఆ పార్టీని కష్టాలు వెంటాడాయి. ఈ క్రమంలో గులాబీ పార్టీలోని పరిణామాలపై కొత్త ఏడాది తొలిరోజే ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది.
పార్టీలో నెంబర్ వన్ నెంబర్ టూ అని టాక్ ఉన్న కేసీఆర్, కేటీఆర్ విషయంలో ఓ వైపు కమిషన్ల విచారణలు మరో వైపు నోటీసులతో పార్టీలో అంతా గడబిడగా ఉండగా ఇంతలో సొంత పార్టీలో కవిత వర్సెస్ కేటీఆర్ మధ్య పొజిషన్ వార్ సాగుతున్నదా అన్న చర్చ తెరపైకి రావడం తీవ్ర సంచలనంగా మారుతున్నది. పార్టీలో కాబోయే సీఎం అంటూ ఇటు కవిత అటు కేటీఆర్ అనుచరులు స్లోగన్స్ ఇవ్వడం హాట్ టాపిక్ అవుతున్నది. అసలే అనేక కష్టాలతో సతమతం అవుతున్న కారు పార్టీలో గతంలో పార్టీలో ఎన్నడూ లేని ఈ కొత్త సంస్కృతి ఇప్పుడు కేడర్ ను కన్ఫ్యూజన్ మరింత కన్ఫ్యూజన్ కు గురి చేస్తోందనే టాక్ గుప్పుమంటోంది.
కవిత వర్సెస్ కేటీఆర్..
రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సరికొత్త ప్రణాళికలు, వ్యూహాలతో పార్టీని సన్నద్ధం చేసేందుకు అధినేత కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీలను ఇరుకున పెడుతూ ప్రజల మన్ననలు పొందేలా వ్యూహరచన చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇంతకాలం అన్నీ తానై నడిపించిన కేసీఆర్ త్వరలోనే ఏదో ఓ రూపంలో పార్టీలో కొత్త జోష్ నింపుతారనే ఆశలు కేడర్ లో నెలకొంటున్న వేళ అనూహ్యంగా పార్టీలో కవిత వర్సెస్ కేటీఆర్ అన్నట్లుగా వ్యవహారం సాగుతోందా అనే చర్చ కలకలం రేపుతున్నది. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇందుకు బలం చేకూర్చేలా ఉండటం కేడర్ ను మరింతగా గందరగోళానికి గురి చేస్తోంది. కవిత, కేటీఆర్ ఎవరి ప్రోగామ్స్ లో వారు సీఎం.. సీఎం అనే నినాదాలు హోరెత్తుతుండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారుతున్నది. ఇటీవల నిజామాబాద్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. ఆ సందర్భంలో అక్కడ నాయకులు కవిత సీఎం.. సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అంతకు ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బెయిల్ పై విడుదలై తొలిసారి హైదరాబాద్ కు వచ్చిన సందర్భంలోనూ ఎయిర్ పోర్టులో ఇవే స్లొగన్స్ వినిపించాయి. ఇంతవరకు బాగానే ఉన్నా కవిత నిజామాబాద్ పర్యటన తర్వాత నిన్న తెలంగాణ భవన్ లో 2025 నూతన సంవత్సర క్యాలెండర్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు కేటీఆర్ సీఎం.. సీఎం అనే నినాదాలతో హాల్ మార్మోగింది. ఇప్పటి వరకు ఆ పార్టీలో సీఎం అంటే కేసీఆర్ అనే భావనే ఉంది. కానీ గతానికి భిన్నంగా సీఎం క్యాండిడేట్ విషయంలో ఇప్పుడు కవిత, కేటీఆర్ పై నినాదాలు రావడంతో ఏం జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది. సీఎం అభ్యర్థి విషయంలో కవిత పేరు ఇటీవల తరచూ వినిపిస్తోంది. జైలుకు వెళ్లిన వారే సీఎం అయితే అందులో కేటీఆర్ కంటే ముందువరుసలో కవిత ఉంటారని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సైతం కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో కేటీఆర్ సీఎం అంటూ నినాదాలు చేయడం వెనుక పార్టీలో ఏం జరుగుతోందనే గుసగుసలు జోరందుకున్నాయి.
కేసీఆర్ మౌనం వల్లే డివిజన్..!
అధికారంలో ఉన్నన్నాళ్లు అంతా హ్యాపీగానే సాగిన గులాబీ పార్టీకి అధికారం దూరం కాగానే కష్టాలు చుట్టుముట్టాయి. ప్రభుత్వం నుంచి విచారణలు, ప్రత్యర్థుల నుంచి విమర్శల దాడులతో కారు పార్టీ కంగారులో పడిపోయింది. ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ దాటి వచ్చి మౌనం వీడటం లేదు. తనకేం సంబంధం లేదు అన్నట్లుగానే ఆయన వ్యవహారం సాగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ లో కేటీఆర్, కవిత, హరీశ్ రావు తలోదారి వెత్తుకునే ప్రయత్నాల్లో ఉన్నారని ప్రత్యర్థులు ఎటాక్ చేస్తున్నా గులాబీ బాస్ మాత్రం మాటైనా మాట్లాడటం లేదు. ఈ క్రమంలో కేసీఆర్ మౌనం ప్రత్యర్థులకు ఆయుధంగా మారడమే కాదు బీఆర్ఎస్ క్యాడర్ లో చీలిక తెస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నది.
కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ భవిష్యత్ ఎవరు అనే చర్చ ప్రస్తుతం ప్రధానాంశంగా మారింది. ఇటువంటి కీలక సమయంలో కేసీఆర్ సైలెన్స్ మోడ్ లో ఉంటే మరో వైపు కాబోయే సీఎం కవిత, కేటీఆర్ అంటూ సొంత పార్టీలోనే క్యాడర్ డివైడ్ కావడం సోషల్ మీడియాలోనే బహిరంగంగానే తమ లీడర్ కు మద్దతుగా నినాదాలు చేస్తుంటే పార్టీలో ఏం జరుగుతోందని ఇటు లీడర్స్ లో అటు క్యాడర్స్ లో అనుమానాలు మొదలవుతున్నాయట. మరి ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ఫామ్ హౌస్ ను వీడి ప్రజాక్షేత్రంలోకి వస్తారా లేక ఇటువంటి చర్చకు మరింత ఆస్కారం ఇస్తారా అనేది వేచి చూడాలి.