KTR: సీఎం రేవంత్ ఆల్రేడీ దాడి మొదలెట్టాడు.. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ కీలక పిలుపు

by Gantepaka Srikanth |
KTR: సీఎం రేవంత్ ఆల్రేడీ దాడి మొదలెట్టాడు.. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్(Deeksha Diwas) వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ప్రజలకు కష్టమొస్తే తెలంగాణ భవన్ గుర్తొస్తుందని అన్నారు. సమైక్యాంధ్ర సంచులు మోసిన తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తెలంగాణ అస్తిత్వంపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దాడి మొదలెట్టాడని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ సమయంలో కూడా ఇలాగే ధర్నాలు చేస్తున్నా తెలంగాణ బిడ్డలపై గన్ను ఎక్కు పెట్టాడని గుర్తుచేశారు. చరిత్ర చదవకుండా.. భవిష్యత్‌ను నిర్మించలేమని తెలిపారు.

తెలంగాణ ప్రజల కోసం మరొక్కసారి దీక్ష చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆత్మగౌరవం.. అస్తిత్వం.. అస్మిత ప్రమాదంలో పడుతున్నప్పుడు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయకపోతే తప్పు చేసినవాళ్లవుతామని అభిప్రాయపడ్డారు. కేసీఆర్(KCR) ఆనవాళ్లు కాదు.. తెలంగాణ ఆనవాళ్లు చెరిపేందుకు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ భవన్.. జనతా గ్యారేజ్‌గా మారిందని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed