- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
KRMB Meeting: కేఆర్ఎంబీ సమావేశం వాయిదా.. ఏపీ సర్కార్ కీలక అభ్యర్థన

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తోందని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఇటీవలే కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB)కి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే కేఆర్‌ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ (KRMB Chairman Atul Jain) అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం బోర్డు సమావేశం కావాల్సి ఉంది. కానీ, అనూహ్యంగా సమావేశాన్ని వాయిదా వేయాలని కోరుతూ.. ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఆర్ఎంబీ (KRMB)కి లేఖ రాశారు. అత్యవసర సమావేశం ఉన్నందున భేటీని వాయిదా వేయాలని ఆ లేఖలో ప్రస్తావించారు. అయితే, మధ్యాహ్నం 3.30కి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy)తో పాటు నీటి పారుదల శాఖ అధికారులు కేఆర్ఎంబీ కార్యాలయానికి వెళ్లి అక్కడ తమ వాదనలు వినిపించనున్నారు. ముఖ్యంగా తాగు, సాగు నీటి అవసరాలను బోర్డుకు వివరించనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశాన్ని ఈనెల 24కు (సోమవారం) మధ్యాహ్నం 3.30కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.