KRMB: ముగిసిన కేఆర్ఎంబీ ప్రత్యేక సమావేశం

by Prasad Jukanti |   ( Updated:24 Feb 2025 1:32 PM  )
KRMB: ముగిసిన కేఆర్ఎంబీ ప్రత్యేక సమావేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కృష్ణానది యాజమాన్య బోర్డు (KRMB) ప్రత్యేక సమావేశం ముగిసింది. కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. జల వివాదాలు, కృష్ణా నీటి (Krishna Water) పంపకాలపై చర్చించారు. ఇప్పటికే ఏపీ ఎక్కువ నీటిని వినియోగించుకున్నదని, శ్రీశైలం (Srisailam) నుంచి ఏపీ నీటి వినియోగాన్ని పూర్తిగా ఆపాలని తెలంగాణ కోరింది. నీటి అవసరాలపై ఇరు రాష్ట్రాల సీఈలు నిర్ణయానికి రావాలని కేఆర్ఎంబీ సూచించింది. సాగర్ కింద పంటల దృష్ట్యా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు భేటీ అయ్యారు. జలసౌధలో విడిగా ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు సమావేశమయ్యారు. బుధవారం కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం అయ్యే అవకాశం ఉంది.

Next Story