- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Super Star Krishna: కృష్ణ మృతి ఇండస్ట్రీకి తీరని లోటు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : సినీ నటుడు కృష్ణ మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కృష్ణ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు వెండితెర 'కౌబాయ్' అని కొనియాడారు. ఐదున్నర దశాబ్దాల పాటు టాలీవుడ్ లో నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారని తెలిపారు. తెలుగు సినిమా తెరపై 'జేమ్స్ బాండ్' జోనర్ ను పరిచయంచేసి, తెలుగు సినీ చరిత్రలో సాంకేతిక కు సంబంధించి ఎన్నో ప్రయోగాలు చేశారన్నారు. కష్టపడి పనిచేస్తే విజయం తథ్యమన్న సూత్రాన్ని నమ్మి ఏడాదికి 10 సినిమాలు చేశారన్నారు. అల్లూరిని ఆరాధ్య దైవంగా నిలిపిన ఘనత కృష్ణకే దక్కిందన్నారు. టాలీవుడ్ స్థాయిని పెంచిన వ్యక్తి లేకపోవడం విచారకరమన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇదిలావుండగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సైతం విచారం వ్యక్తం చేశారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఫోన్ చేసి తెలుసుకున్నానని, ఇంతలోపే ఆయన మరణించారన్న వార్త విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. కృష్ణ తన సినిమాల్లో నటిస్తున్నప్పుడు ప్రజలకు, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ఎదిరించే మనస్తత్వాన్ని రేకెత్తించారని కొనియాడారు. ఆయన నటించిన చిత్రాలన్నీ సమాజాన్ని చైతన్యం చేసే చిత్రాలేనన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
Super Star Krishna: చనిపోయాడని బాధ పడాల్సిన అవసరం లేదు.. ఆర్జీవి ట్వీట్