- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Komati Reddy: కేసీఆర్‌ను జాతిపిత అని పొగిడి ఆకాశంలో కూర్చోబెట్టారు
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కేసీఆర్‌ను జాతిపిత జాతిపిత అంటూ పొగిడి ఆకాశంలో కూర్చోబెట్టారని.. ఓడిపోయినా కూడా ఆయన ఇంకా అదే ఊహలో బతుకుతున్నాడని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేశారు. శుక్రవారం అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సెంటిమెంట్ వాడుతున్న వారు.. గౌరవంగా ఉండాలి. పార్టీ మారి ఉండాల్సింది కాదు అని హితవు పలికారు. ఒకవేళ పార్టీ మారే వారు రాజీనామా చేసి వెళ్లాలి. పార్టీలో అన్ని పదవులు అనుభవించి.. కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా వెళతారు? అని ప్రశ్నించారు. తప్పుడు నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ సభలో ఉంటే సమాధానం చెప్పాల్సి వచ్చేది. నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ సభలో లేనప్పుడు ఎన్ని మాట్లాడినా.. అనుకున్న ఫలితం ఉండదు. పవర్ మీద డిస్కషన్‌లో కేసీఆర్ ఉండి ఉంటే.. ఇంకా బాగా జరిగేది అని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు.