Kishan Reddy: ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి.. కాంగ్రెస్ నేతలకు కిషన్‌రెడ్డి స్ట్రాంగ్ రిప్లై

by Shiva |
Kishan Reddy: ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి.. కాంగ్రెస్ నేతలకు కిషన్‌రెడ్డి స్ట్రాంగ్ రిప్లై
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కుట్రలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ (Congress) నేతలు బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP)పై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. సంక్షేమంలో దూసుకెళ్తోన్న ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేందుకు తెర వెనుక బీఆర్ఎస్ (BRS) భారీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. బీజేపీ (BJP), గుజరాత్ (Gujarat) వ్యాపారులతో కలసి గులాబీ పార్టీ ప్లాన్ చేసిందని కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ మీడియాతో ఆయన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమ పార్టీకి లేదని కామెంట్ చేశారు. అయినా, తెలంగాణకు సంబంధం లేని గుజరాత్ వ్యాపారులు ప్రభుత్వాన్ని ఎందుకు కూల్చుతారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు పాలించాలనే తాము కోరుకుంటున్నామని.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే హస్తం పార్టీకి మిగిలేది శూన్య హస్తమేనని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ (Congress) పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని.. ఆ పార్టీ ఓడిపోబోతోందనే విషయం కామన్ మ్యాన్‌కు కూడా తెలుసని కిషన్ రెడ్డి అన్నారు.



Next Story

Most Viewed