- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టార్గెట్ బీఆర్ఎస్, కాంగ్రెస్.. బీజేపీ నేతలకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో వంద రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేసేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటోంది. వచ్చే ఎన్నికలకు కుటుంబ పాలన సాగించే పార్టీలనే అస్త్రంగా పెట్టుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఎంఐఎంను సైతం ఏకిపడేయాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల వర్క్ షాప్ లో ప్రధానంగా ఈ అంశాలపైనే చర్చ జరిగింది. ఆ రెండూ కుటుంబ పార్టీలు కావడంతో ‘ఫ్యామిలీ ఫస్ట్.. పీపుల్ నెక్ట్స్’ అనే కాన్పెప్ట్‌తో పనిచేస్తాయనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
పథకాల లబ్ధిదారులపై నజర్..
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే అధికార పార్టీకి చెక్ పెట్టడంతో పాటు కాంగ్రెస్ ఓటు బ్యాంకు సైతం తగ్గించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం చూస్తోంది. బీఆర్ఎస్‌కు చెక్ పెట్టేందుకు ఆ పార్టీ పథకాలు అందుకున్న లబ్ధిదారులను క్రమంగా బీజేపీ వైపునకు లాక్కోవాలని చూస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ స్కీమ్స్ అందుకున్న లబ్ధిదారులను అట్రాక్ట్ చేసేందుకు బూత్ స్థాయి నుంచి ప్రభావితం చేసేలా తరచూ లబ్ధిదారులను కలవాలని నిర్ణయం తీసుకుంది. అలా బీఆర్ఎస్‌కు ఉచ్చు బిగించి కట్టడి చేయాలని చూస్తోంది.
కాంగ్రెస్, ఎంఐఎంలకు చెక్..
కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిన స్కామ్‌లను ప్రజల్లోకి తీసుకెళ్లాలని డిసైడ్ అయింది. అలాగే ఎంఐఎంకు చెక్ పెట్టేందుకు పాత బస్తీ అభివృద్ధి, మెట్రో రైలు విస్తరణ, ఇతరత్రా అంశాలతో కట్టడి చేయాలని చూస్తోంది. బీజేపీ వంద రోజుల యాక్షన్ ప్లాన్ ను అమలు చేసేందుకు పార్టీ ముఖ్య నేతలు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్ చార్జీలతో రెండ్రోజుల పాటు సమావేశం నిర్వహించింది. దీన్ని జిల్లాలు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా గ్రౌండ్ లెవల్ వరకు అమలు చేయడంపై వారికి బ్రీఫింగ్ చేసింది.
పార్టీని అధికారంలోకి తేవాలి..
నాంపల్లి రాష్ట్ర కార్యాయలంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు కిషన్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తేవాలని ఆయన పిలుపునిచ్చారు. కొన్ని టీవీ చానళ్లు, సోషల్ మీడియాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయని వాటిని నేతలంతా దీటుగా ఎదుర్కోవాలని సూచించారు.